బుధవారం 03 మార్చి 2021
International - Feb 06, 2021 , 15:24:31

భూమివైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం

భూమివైపు దూసుకొస్తున్న భారీ గ్రహశకలం

వాషింగ్టన్‌: ఒక భారీ గ్రహశకలం భూమి వైపు దూసుకొస్తున్నది. అమెరికాలోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ (93 మీటర్లు)కి రెండితల సైజు ఉన్న ఈ ఆస్ట్రాయిడ్‌ ఈ నెల 22న భూమికి అతి సమీపంగా రానున్నది. 2020 ఎక్స్‌యూ6 పేరుతో పిలిచే ఈ గ్రహశకలం 213 మీటర్ల పొడవున్నది. గంటకు 30,240 కిలోమీటర్ల వేగంతో భూమి వైపు దూసుకొస్తున్నది. ఈ వేగంతో ప్రయాణించే ఈ ఆస్ట్రాయిడ్‌ భూమిని ఒక గంటలో చుట్టి రాగలదు. 

2020 ఎక్స్‌యూ6 గ్రహశకలాన్ని భూమికి అతి దగ్గరగా వచ్చే వస్తువుగా నాసా తెలిపింది. దీనిని ప్రమాదకర ఆస్ట్రాయిడ్‌గా పేర్కొన్నప్పటికీ ఈసారి భూమిని ఇది ఢీకొట్టబోదని, ప్రస్తుతం దీని వల్ల ఎలాంటి ముప్పు లేదని చెప్పింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలం­గాణ ఆండ్రా­యిడ్ యాప్ డౌన్‌­లోడ్ చేసు­కోండి

VIDEOS

logo