శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Sep 13, 2020 , 09:47:48

భూమి వైపు దూసుకొస్తున్న మరో గ్రహశకలం..

భూమి వైపు దూసుకొస్తున్న మరో గ్రహశకలం..

వాషింగ్టన్‌ : గత కొద్ది రోజులుగా గ్రహ శకలాలు భూమి వైపు దూసుకొస్తున్నాయి. దాదాపు మన గ్రహానికి అత్యంత సమీపం నుంచి వెళ్తున్నా.. వాటి గమనాన్ని అంచనా వేయడం శాస్త్రవేత్తలకు తలనొప్పిగా మారింది. ఈ క్రమంలో ఈ నెల 14న ప్రమాదకరమైన మరో ఆస్టరాయిడ్‌ దగ్గర నుంచి వెళ్లబోతోంది. ఇది రెండు ప్రొఫెషనల్‌ అమెరికన్‌ ఫుట్‌బాల్‌ మైదానాలు కలిపినా వాటికంటే ఉంటుందని నాసా తెలిపింది. నాసాకు చెందిన జెట్‌ ప్రొపల్షన్‌ లేబొరేటరీ (జేపీఎల్‌) తెలిపిన వివరాల ప్రకారం.. ఆస్టరాయిడ్‌ గంటకు 38,624.256 కిలోమీటర్ల వేగంతో మన గ్రహంపై మీదుగా ఎగురుతోందని అంచనా. భూమికి 6.7 మిలియన్‌ కిలోమీటర్ల దూరం రానుందని పేర్కొంది. నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్ (నియో) ఎర్త్ క్లోజ్ అప్రోచెస్ జాబితాలో పెద్ద గ్రహశకలాలలో ఒకటిగా నిలిచింది. అంతరిక్ష రాయిని 2020 క్యూఎల్‌-2గా శాస్త్రవేత్తలు పిలుస్తున్నారు. ఆస్టరాయిడ్‌ను ప్రమాదకరంగా భావిస్తున్నప్పటికీ.. భూమిని ఢీకొట్టే అవకాశాలు లేవని స్పష్టం చేసింది. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo