మంగళవారం 26 మే 2020
International - Apr 01, 2020 , 00:27:04

వయసు పెరుగుతున్నా కొద్దీ వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువ

వయసు పెరుగుతున్నా కొద్దీ వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువ

  • కరోనాపై లాన్సెట్‌లో తాజా అధ్యయనం 

లండన్‌: కరోనాతో తక్కువ వయసున్న వారిలో తక్కువ.. ఎక్కువ వయసున్న వారిలో ఎక్కువ ప్రమాదమని ఒక అధ్యయనం వెల్లడించింది. అంటే వయసుతోపాటు కరోనాకు గురయ్యే అవకాశాలు, మరణించే రేటు అధికంగా ఉంటుందని స్పష్టం చేసింది. లండన్‌లోని ఇంపీరియల్‌ కాలేజీ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ప్రముఖ వైద్య పత్రిక ‘లాన్సెట్‌'లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.  కరోనా వల్ల వివిధ వయస్సులను బట్టి మరణాల రేటు 0.0016 శాతం నుంచి 7.8 శాతంగా ఉంటుందని పేర్కొంది. అప్పుడే పుట్టిన శిశువు నుంచి తొమ్మిదేండ్ల పిల్లల్లో మరణాల రేటు 0.0016 శాతంగా ఉంటుందని అధ్యయనం అంచనా వేసింది. 80 ఏండ్లు దాటిన వాళ్లలో మరణాల రేటు 7.8 శాతంగా ఉంటుందని వెల్లడించింది. కరోనాతో దవాఖానపాలయ్యే వారు 0.04 శాతం (10-19 ఏండ్లు), 1 శాతం (20-29 ఏండ్లు), 3.4 శాతం (30-39 శాతం), 4.3 శాతం(40-49 ఏండ్లు), 8.2 శాతం(50-59 ఏండ్లు),  11.8 శాతం(60-69 ఏండ్లు), 16.6 శాతం(70-79 ఏండ్లు)గా ఉంటుందని అంచనా వేసింది.


logo