గురువారం 02 ఏప్రిల్ 2020
International - Jan 31, 2020 , 09:54:51

ఐబీఎం సీఈవోగా అర‌వింద్ కృష్ణ‌

ఐబీఎం సీఈవోగా అర‌వింద్ కృష్ణ‌

హైద‌రాబాద్‌:  అమెరికాకు చెందిన దిగ్గ‌జ ఐటీ సంస్థ ఐబీఎమ్ సీఈవోగా అర‌వింద్ కృష్ణ ఎన్నిక‌య్యారు.  ఐబీఎం సంస్థ త‌న ట్విట్ట‌ర్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.  బోర్డ్ ఆఫ్ డైర‌క్ట‌ర్లు.. కృష్ణ‌ను సీఈవోగా ఎన్నుకున్న‌ట్లు సంస్థ పేర్కొన్న‌ది.  ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీ నుంచి ఆయ‌న సీఈవో విధులు నిర్వ‌ర్తిస్తారు.  ప్ర‌స్తుతం అర‌వింద్ కృష్ణ‌.. ఐబీఎంలో క్లౌడ్ అండ్ కాగ్నిటివ్ సాఫ్ట్‌వేర్‌కు సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.  రెడ్ హాట్‌ను కొనుగోలు చేయ‌డంలో ఆయ‌నే కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు.  ఐబీఎంకు సుమారు 40 ఏళ్లు సేవ‌లందించిన సీఈవో రొమెట్టి స్థానంలో అర‌వింద్ కృష్ణ బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు.  1990లో కృష్ణ ఐబీఎంలో చేరారు. క‌న్పూర్‌లోని ఐఐటీలో ఆయ‌న చ‌దివారు. ఇలియ‌నాస్ వ‌ర్సిటీ నుంచి ఎల‌క్ట్రిక‌ల్ ఇంజ‌నీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. ఈసీవోగా ఎన్నిక కావ‌డం థ్రిల్లింగ్ ఉంద‌ని, ఆ బాధ్య‌త‌ల‌ను గౌర‌వంగా భావిస్తాన‌న్నారు. బోర్డు త‌నపై ఉంచిన విశ్వాసానికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.   


logo