ఆదివారం 12 జూలై 2020
International - May 25, 2020 , 00:50:03

త్వరలోనే కృత్రిమ కన్ను

త్వరలోనే కృత్రిమ కన్ను

  • సహజ కన్నుతో సమానంగా పనితీరు

హాంకాంగ్‌: సూర్యోదయాన్ని చూడటం, చదువడం వంటి పనుల్ని కంటి సాయంతో చేయగలం. అయితే, కృత్రిమ పద్ధతిలో తయారు చేసిన ‘సింథటిక్‌ కన్ను’ సాయంతో కూడా ఇలాంటి పనుల్ని చేసే రోజు త్వరలోనే రానున్నదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హాంకాంగ్‌ కాలేజీ ఆఫ్‌ సైన్స్‌, కాలేజీ ఆఫ్‌ కాలిఫోర్నియా కు చెందిన శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ కన్నును తయారు చేశారు. కృత్రిమ రెటీనా, ఫొటో సెన్సార్లు, ద్రవరూప మెటల్‌ వంటి నిర్మాణాలు ఈ కన్నులో  ఉన్నాయని శాస్త్రవేత్తలు వివరించారు. సాధారణ కంటి సామర్థ్యాల్ని త్వరలోనే అందిపుచ్చుకోనున్న ఈ కృత్రిమ కన్నును త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. 


logo