గురువారం 28 మే 2020
International - Apr 29, 2020 , 14:35:13

గాడిద‌ పుట్టిన‌రోజున సెలెబ్రేషన్స్‌..వీడియో వైరల్‌

గాడిద‌ పుట్టిన‌రోజున సెలెబ్రేషన్స్‌..వీడియో వైరల్‌

హాలీవుడ్‌ కండల వీరుడు, కాలిఫోర్నియా మాజీ గ‌వ‌ర్న‌ర్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన వీడియో తెగ వైరల్‌ అవుతుంది. తను పెంచుకుంటున్న గాడిదకు మొదటి పుట్టినరోజు అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌చేశాడు. దాని పేరు లులు.. ఆర్నాల్డ్‌ కి లులు అంటే చాలా ఇష్టమట. దీనికి సాక్ష్య‌మే ఈ వీడియో. మా లులు మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంది.. దాని పుట్టినరోజు సెలెబ్రేట్‌ చేసుకుంటున్నామంటూ షేర్‌ చేశాడు..  లులుకి కేక్‌ తినిపిస్తూ 'హ్యాపీ బ‌ర్త్‌డే డియ‌ర్ లులు' అంటూ పాట పాడాడుతూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.  ఇక ఈవీడియో నెట్టింట హల్‌ చల్‌ చేస్తుంది. అంతే కాదు ఈ వీడియోలో లులు తో పాటు ఒక గుర్రం కూడా ఉంది..   ట్విట్టర్‌లో ఐదువేల మంది రీట్వీట్‌ చేయగా, 45,000 లైకులు వచ్చాయి.logo