శనివారం 30 మే 2020
International - May 07, 2020 , 17:31:16

240 ఏండ్ల తర్వాత కనిపించింది!

240 ఏండ్ల తర్వాత కనిపించింది!

ఒకటికాదు, రెండు కాదు 240 ఏండ్ల క్రితం కనుమరుగైన ఓ విహంగం ఇప్పుడు మళ్లీ కనిపించింది. దీంతో బ్రిటన్‍లోని పక్షి ప్రేమికుల ఆనందానికి అవధులు లేవు. తెల్లని తోక, పెద్ద రెక్కలతో ఉండే ఈ గద్దని ప్రే పక్షిగా పేర్కొంటారు. దీన్ని తెల్లని తోక గద్ద, చేప గద్ద అని కూడా పిలుస్తారు. దీని రెక్కలు రెండున్నర మీటర్ల పొడవు ఉంటాయి. ఈ పక్షి 1780వ సంవత్సరంలో చివరిసారిగా కనిపించిదట. 18వ శతాబ్దంలో వీటిని విచక్షణారహితంగా వేటాడి చంపడంతో వీటి సంఖ్య తగ్గిపోయింది. వీటిని సిట్-అండ్-వెయిట్ పక్షులు అని పిలుస్తారు, ఇవి ఆహారం కోసం మైళ్ళు ఎగరడానికి బదులుగా ఒక దగ్గర కూర్చుండటానికి ఇష్టపడతాయట.logo