గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 27, 2020 , 10:40:06

స్మోకింగ్ చేస్తున్నారా ? క‌రోనాతో కేర్‌ఫుల్‌

స్మోకింగ్ చేస్తున్నారా ? క‌రోనాతో కేర్‌ఫుల్‌

హైద‌రాబాద్‌: మీరు స్మోకింగ్ చేస్తారా. అయితే మీకు క‌రోనా వైర‌స్ సంక్ర‌మించే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. ధూమ‌పానం చేసేవాళ్ల చేతివేళ్లు.. ఎప్పుడూ పెద‌వుల‌ను తాకే అవ‌కాశాలు ఉంటాయి.  దాని వ‌ల్ల చేతిలో ఉన్న వైర‌స్‌.. పెద‌వుల ద్వారా శ‌రీరంలోకి వెళ్లే ఛాన్సు ఎక్కువ‌గా ఉంటుంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న‌ది.  ఒక‌వేళ సిగ‌రెట్లకు వైర‌స్ ప‌ట్టుకుని ఉన్నా.. అప్పుడు కూడా ప‌రిస్థితి ఇలాగే ఉంటుంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో తెలిపింది.  స్మోకింగ్ చేసేవాళ్ల‌కు సాధార‌ణంగా ఊపిరితిత్తుల స‌మ‌స్య ఉంటుంది. వారి లంగ్ కెపాసిటీ కూడా త‌క్కువ‌గా ఉంటుంది. అయితే కోవిడ్19 ప్ర‌బ‌లుతున్న స‌మ‌యంలో.. అలాంటి స్మోక‌ర్లు వైర‌స్ వ‌ల్ల మ‌రింత బ‌ల‌హీనంగా మారే ప్ర‌మాదం ఉంద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రించింది. 

వాట‌ర్ పైప్స్‌తో కొంద‌రు ధూమాపానం చేస్తారు. అలాంటి వాళ్లు త‌రుచూ మౌత్‌పీస్‌ల‌ను షేర్‌ చేయాల్సి వ‌స్తుంది. ఆ సంద‌ర్భంలో మ‌రొక‌రిలో ఉన్న వైర‌స్ మ‌రొక‌రికి సంక్ర‌మించే అవ‌కాశాలు ఉన్నాయి. ఇది క‌మ్యున‌ల్ స్థాయిలో జ‌రిగే ప్ర‌మాదం కూడా ఉన్న‌ది. స్మోకింగ్ వ‌ల్ల ఊపిరితిత్తుల‌తో పాటు శ‌రీరంలోని ఇత‌ర అవ‌య‌వాలు దెబ్బ‌తినే అవ‌కాశం ఉన్న‌ది. శ్వాస‌కోస వ్య‌వ‌స్థ బ‌ల‌హీనంగా మారుతుంది. దీని వ‌ల్ల కోవిడ్‌19 ఇన్‌ఫెక్ష‌న్ తొంద‌ర‌గా సంక్ర‌మిస్తుంది. ఆరోగ్యంగా ఉండాన‌లుకునేవారు.. వెంట‌నే ధూమ‌పానాన్ని నిలిపివేయ‌డం బెట‌ర్. ఇదే స‌రైన స‌మ‌యం అనుకుని స్మోకింగ్‌ను మానేయండి. logo