బుధవారం 03 మార్చి 2021
International - Jan 22, 2021 , 22:10:54

మ‌రోసారి రుజువైన సింప్స‌న్ జోస్యం!

మ‌రోసారి రుజువైన సింప్స‌న్ జోస్యం!

వాషింగ్ట‌న్‌: కార్టూన్ల‌తో అమెరిక‌న్ల‌ను ఆల‌రించే సెటైరిక‌ల్ షో సింప్స‌న్.. భ‌విష్య‌త్ గురించి త‌న జోస్యం స‌రైందేన‌ని మ‌రోసారి రుజువు చేసుకున్న‌ది. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్‌, ఉపాధ్య‌క్షురాలు క‌మ‌లా హ్యారిస్ ప్ర‌మాణ స్వీకార వేడుక ఇందుకు నిద‌ర్శ‌నంగా నిలిచింది. అమెరికా తొలి మ‌హిళా ఉపాధ్య‌క్షురాలిగా ప్ర‌మాణం చేసి హ్యారిస్ చారిత్ర‌క రికార్డు నెల‌కొల్పారు. ఈ వేడుక‌కు త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన‌ ఊదారంగు డ్రెస్‌, ముత్యాల‌తో కూడిన చెవిరింగులు, నెక్లెస్‌ ధ‌రించి హ‌ర్రీస్ హాజ‌ర‌య్యారు.

2000లో బార్ట్ టుది ప్యూచ‌ర్ అనే ఎపిసోడ్‌లో లిసా సింప్స‌న్ సైతం దాదాపు క‌మ‌లా హ్యారిస్ మాదిరే ఊదా రంగు డ్రెస్‌, ముత్యాల చెవి రింగులు ధ‌రించి కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ ఎపిసోడ్‌లో లిసా సింప్స‌న్ అమెరికా మ‌హిళా అధ్య‌క్షురాలిగా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తున్న‌ట్లు న‌టించారు. తాజాగా క‌మ‌లా హ్యారిస్ దేశ ఉపాధ్య‌క్షురాలిగా ఎన్నికైన తొలి న‌ల్ల‌జాతీయురాలిగా రికార్డు నెలకొల్పారు. ప్ర‌మాణ స్వీకారానికి ఊదారంగు డ్రెస్‌తో క‌మ‌లా హ్యారిస్ హాజ‌రు కావ‌డంతో మ‌రోసారి సింప్స‌న్ జోస్యం రుజువైంద‌ని షో ఫ్యాన్స్ గుర్తు చేసుకున్నారు.

ఒక అభిమాని.. క‌మ‌లా హ్యారిస్, లిసా సింప్స‌న్ ఫొటోల‌ను ప‌క్క‌ప‌క్క‌న బెట్టి.. క‌మ‌లా హ్యారిస్ అండ్ లిసా సింప్స‌న్ ఒకేలా ఉన్నారు అని క్యాప్ష‌న్ రాశారు. మ‌రో సింప్స‌న్ ఫ్యాన్ స్పందిస్తూ.. క‌మ‌లా హ్యారిస్‌ నిజంగా లిసా సింప్స‌న్‌.. నా మ‌ద్ద‌తు ఆమెకే అని పేర్కొన్నారు. సింప్స‌న్ షో భ‌విష్య‌త్ జోస్యాల గురించి ఫ్యాన్స్ గుర్తు చేసుకోవ‌డం ఇదే తొలిసారేం కాదు. క్యాపిట‌ల్ భ‌వ‌నంపై దాడి, హింస ఘ‌ట‌న‌కు ముందే సింప్స‌న్ సీజ‌న్ 7లో ది డే ది వ‌యొలెన్స్ డైడ్‌ అనే పేరుతో ప్ర‌సార‌మైన 18వ ఎపిసోడ్‌లోనూ పున‌రావ్రుతం కావ‌డం యాద్రుచ్ఛిక‌మే.   

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

VIDEOS

logo