బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Mar 26, 2020 , 18:28:03

అఫ్గాన్‌లో గురుద్వారాపై దాడి అమానుషం: సిక్కు క‌మిటీ

అఫ్గాన్‌లో గురుద్వారాపై దాడి అమానుషం: సిక్కు క‌మిటీ

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్‌లో గురుద్వారాపై ఆత్మాహుతి దాడిని ఆల్ పార్టీస్ సిక్కు కోఆర్డినేష‌న్ క‌మిటీ (ఏపీఎస్‌సీసీ) తీవ్రంగా ఖండించింది. ఈ దాడి అమానుష‌మ‌ని మండిప‌డింది. ప్ర‌పంచవ్యాప్తంగా ఏ దేశంలో చూసినా మైనారిటీలపై దాడులు జ‌రుగుతూనే ఉన్నాయ‌ని, ఇలాంటి దాడులు జ‌రుగ‌కుండా ప్ర‌భుత్వాలు ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని సిక్కు కోఆర్డినేష‌న్ క‌మిటీ డిమాండ్ చేసింది. 

అమాన‌వీయంగా దాడుల‌కు పాల్ప‌డి అమాయ‌కుల ప్రాణాలు తీయ‌డం ప్ర‌పంచ శాంతి సూత్రానికి విఘాతం క‌లిగిస్తుంద‌ని ఆల్ పార్టీస్ సిక్కు కోఆర్డినేష‌న్ క‌మిటీ చైర్మ‌న్ జ‌గ్మోహ‌న్‌ రైనా అభిప్రాయ‌ప‌డ్డారు. బుధ‌వారం ఒక ఆత్మాహుతి బాంబ‌ర్ కాబూల్‌లోని గురుద్వారాలో చొర‌బ‌డి త‌న‌ను తాను పేల్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ దాడిలో 25 మంది సిక్కు సోద‌రులు మృతిచెందారు. మ‌రో ఎనిమిది మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 


logo
>>>>>>