శనివారం 30 మే 2020
International - May 09, 2020 , 10:36:51

వచ్చే వారం తెరుచుకోనున్న ఆపిల్ స్టోర్స్‌...

వచ్చే వారం తెరుచుకోనున్న ఆపిల్ స్టోర్స్‌...

శాన్‌ఫ్రాన్సిస్కో:  క‌రోనా వైర‌స్ కార‌ణంగా లాక్‌డౌన్ విధించ‌డం వ‌ల్ల మూత‌ప‌డ్డ ఆపిల్ స్టోర్లు యూఎస్‌లో వ‌చ్చే వారం తెరుచుకోనున్న‌ట్లు కంపెనీ ప్ర‌తినిధులు ప్ర‌క‌టించారు. వినియోగ‌దారుల‌, ఉద్యోగుల శ‌రీర ఉష్ణోగ్ర‌త‌, ఇత‌ర ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి ఫేస్ క‌వ‌ర్ ఉన్న‌వారికి మాత్ర‌మే స్టోర్‌లోకి అనుమ‌తిస్తామ‌న్నారు. ‌క‌స్ట‌మ‌ర్లు, ఉద్యోగులు త‌ప్ప‌నిస‌రిగా బౌతిక దూరం పాటించేలా చూస్తామ‌న్నారు. మార్చి రెండో వారం నుంచి యూఎస్‌లో ఆపిల్ రిటైల్ స్టోర్లు మూసి ఉన్నాయి. 

ఇదోహా, సౌత్ క‌రోలినా, అల‌బామా, అలాస్కాలోని కొన్ని స్టోర్ల‌ను మొద‌ట ఒపెన్ చేస్తామ‌ని, మ‌రో వారం అనంత‌రం ప‌రిస్థితిని బ‌ట్టి మిగితా స్టోర్టు తెరుస్తామ‌న్నారు. కొత్త‌గా బౌతిక‌దూరం పాటించాల్సి రావ‌డం, ప‌రిమిత సంఖ్య‌లో వినియోగ‌దారులు షాప్‌లోకి అనుమ‌తించ‌డం త‌దిత‌ర చ‌ర్య‌ల‌తో క‌స్ట‌మ‌ర్ల‌కు ఇబ్బంది క‌ల‌గ‌వ‌చ్చు. వినియోగ‌దారులు ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసి హోం డెలివ‌రీ, పిక‌ప్ పాయింట్ల వ‌ద్ద తీసుకోవ‌డానికి ప్రాధాన్య‌మివ్వాల‌ని సూచిస్తున్న‌ట్లు తెలిపారు.

 ఆపిల్ కంపెనీ యూఎస్‌లో 271 స్టోర్లు, ప్ర‌పంచ వ్యాప్తంగా 500 స్టోర్లు క‌లిగి ఉంది. వాటిలో ప్ర‌స్తుతం యూఎస్‌లోని ఆరు షాప్‌ల‌ను మాత్ర‌మే తెరుస్తున్నారు. ఆసియా, యూర‌ప్‌, ఆస్ట్రేలియా దేశాల్లోని దుకాణాలు కూడా లాక్‌డౌన్ అనంత‌రం మూసివేయ‌బ‌డ్డాయి. ఆయా దేశాల్లో ప్ర‌స్తుతం 70 స్టోర్లు తెరుచుకున్న‌ట్లు ప్ర‌తినిధులు తెలిపారు. ప్ర‌పంచ దేశాల ప్ర‌భుత్వాల మార్గ‌ద‌ర్శ‌కాల‌ను అనుస‌రిస్తూ నిబంధ‌న‌ల మేర‌కు దుకాణాలు నిర్వ‌హిస్తామ‌ని పేర్కొన్నారు. logo