మంగళవారం 31 మార్చి 2020
International - Mar 10, 2020 , 11:56:37

చైనాలో మళ్లీ తెరుచుకుంటున్న ఆపిల్‌ స్టోర్లు

చైనాలో మళ్లీ తెరుచుకుంటున్న ఆపిల్‌ స్టోర్లు

బీజింగ్‌: చైనాలో కరోనా వైరస్‌ తీవ్రంగా ప్రబలిన నేపథ్యంలో ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఆపిల్‌ తన రిటెయిల్‌ స్టోర్లను మూసివేసిన సంగతి తెలిసిందే. జనవరి నెలలో కరోనా ప్రభావం అక్కడ ఎక్కువగా ఉండడంతో ఆపిల్‌ తన స్టోర్లను మూసివేసింది. అయితే ప్రస్తుతానికి చైనాలో కరోనా ప్రభావం తగ్గుతుండడం, ఆ వ్యాధి బారిన పడిన వారు త్వరగా రికవరీ అవుతుండడంతో.. ఆపిల్‌ తన స్టోర్లను తిరిగి ఓపెన్‌ చేసింది. అక్కడ ఉన్న 42 రిటెయిల్‌ స్టోర్స్‌లో 90 శాతం స్టోర్స్‌ను ఓపెన్‌ చేసినట్లు ఆపిల్‌ వెల్లడించింది. ఆపిల్‌ సీఈవో టిమ్‌కుక్‌ ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. 
logo
>>>>>>