ఆదివారం 09 ఆగస్టు 2020
International - Aug 02, 2020 , 07:17:38

29,800 చైనా యాప్స్‌ను తొలిగించిన ఆపిల్‌

29,800 చైనా యాప్స్‌ను తొలిగించిన ఆపిల్‌

షాంఘై: టెక్నాలజీ దిగ్గజ సంస్థ ‘ఆపిల్‌' తన యాప్‌ స్టోర్‌ నుంచి 29,800 చైనా యాప్స్‌ను తొలిగించింది. వాటిలో 26 వేలకు పైగా యాప్స్‌ గేమ్స్‌కు సంబంధించినవి ఉన్నాయి. అనుమతి లేని గేమ్స్‌పై చైనా అధికారులు దాడులు జరుపుతున్న నేపథ్యంలో ఆపిల్‌ ఈ చర్య తీసుకుంది. 

గేమ్ యాప్స్ రూపొందించేవారిని ప్ర‌భుత్వం జారీ చేసిన లైసెన్సులు స‌మ‌ర్పించాల‌ని గ‌తేడాది యాపిల్ సంస్థ కోరింది. అదేవిధంగా గ‌త నెల మొద‌టివారంలో 2500కుపైగా యాప్‌ల‌ను త‌న యాప్ స్టోర్ నుంచి యాపిల్ తొల‌గించింది. logo