ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Aug 11, 2020 , 11:10:31

బిలియ‌నీర్‌గా మారిన టిమ్ కుక్‌..

బిలియ‌నీర్‌గా మారిన టిమ్ కుక్‌..

హైద‌రాబాద్‌: యాపిల్ సీఈవో టిమ్ కుక్ ఇప్పుడు బిలీయ‌నీర్‌గా మారారు.  ఐఫోన్ త‌యారీదారుడు అన్ని గ‌త రికార్డుల‌ను బ్రేక్ చేశారు.  యాపిల్ కంపెనీ విలువ ప్ర‌స్తుతం 1.84 ట్రిలియ‌న్ డాల‌ర్లుగా ఉన్న‌ది. ఇక టిమ్ కుక్ ఆస్తులు.. బిలియ‌న్ల డాల‌ర్లు దాటింది. దీంతో ఆయ‌న అధికారికంగా బిలియ‌నీర్(సుమారు 7500 కోట్లు)‌గా మారారు. బ్లూమ్‌బ‌ర్గ్ బిలియ‌నీర్ల జాబితాలో.. అమెజాన్ వ్య‌వ‌స్థాప‌కుడు జెఫ్ బేజోస్ (187 బిలియ‌న్ల డాల‌ర్లు),  మైక్రోసాఫ్ట్ సీఈవో బిల్ గేట్స్‌(121 బిలియ‌న్ డాల‌ర్లు), ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్ (102 బిలియ‌న్ డాల‌ర్లు) ఉన్నారు. యాపిల్‌లో కుక్‌కు 847969 షేర్లు ఉన్నాయి. గ‌త ఏడాది కుక్ 125 మిలియ‌న్ల డాల‌ర్ల మొత్తాన్ని పే ప్యాకేజీగా తీసుకువెళ్లారు. 2 ట్రిలియ‌న్ డాల‌ర్ల విలువైన కంపెనీగా రికార్డు సృష్టించేందుకు యాపిల్ దూసుకువెళ్తున్న‌ది. గ‌త వార‌మే సౌదీకి చెందిన ఇంధ‌న సంస్థ ఆరామ్కోను విలువైన కంపెనీల జాబితాలో యాపిల్ దాటేసింది. 

 


logo