మంగళవారం 19 జనవరి 2021
International - Jan 13, 2021 , 01:55:12

కుదిరితే మరో ఐదేండ్లు!

కుదిరితే మరో ఐదేండ్లు!

ఐరాస: సభ్య దేశాలు అంగీకరిస్తే మరో ఐదేండ్లపాటు పదవిలో కొనసాగేందుకు ఆసక్తితో ఉన్నానని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ తెలిపారు. జనవరి 1, 2022 నాటికి గుటెరస్‌ పదవీకాలం ముగియబోతున్నది. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి పదవిని చేపట్టడంపై ఈ వ్యాఖ్యలు చేశారు. భద్రతా మండలి సిఫారసుతో ఐరాస ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటారు. ఐరాసలో శాశ్వత సభ్యత్వం కలిగిన ఐదు దేశాలు ఈ ఎన్నికలో కీలకపాత్ర పోషిస్తాయి.