బోస్టన్, జూలై 26: కొవిడ్-19 తీవ్రతను కనుగొనే విధానాన్ని అమెరికాలోని మసాచుసెట్స్, హార్వర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు తాజాగా అభివృద్ధి చేశారు. ముక్కు ద్వారా వైరస్ శరీరంలోనికి ప్రవేశించినప్పుడు దాన్ని నిలువరించడానికి తొలిసారిగా ఏర్పడిన యాంటీవైరల్ రెస్పాన్స్ (వైరస్‌ను అడ్డుకునే రోగనిరోధక వ్యవస్థ లాంటిది) పనితీరు ఆధారంగా కొవిడ్-19 తీవ్రతను అంచనా వేయవచ్చని తెలిపారు. రోగికి మరోసారి వైరస్ సోకినట్లయితే, దాని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుందో యాంటీవైరల్ రెస్పాన్స్‌ను బట్టి తెలుసుకోవచ్చన్నారు. 58 మంది వలంటీర్ల నమూనాలపై చేసిన పరిశోధనల్లో ఈ విషయం వెల్లడైందని పేర్కొన్నారు. ఈ వివరాలు ‘సెల్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.