బుధవారం 03 జూన్ 2020
International - May 08, 2020 , 02:46:12

కరోనా చికిత్సకు ‘ఇలామా’ ప్రతిరోధకాలు!

కరోనా చికిత్సకు ‘ఇలామా’ ప్రతిరోధకాలు!

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి చికిత్సకు నాలుగేండ్ల వయసున్న ఓ ఇలామా జంతువు ప్రతిరోధకాలు (యాంటీబాడీలు) సాయపడుతున్నాయని అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌, బెల్జియంలోని ఘెంటా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. బెల్జియంలోని ఓ పరిశోధనశాలలో ‘వింటర్‌' అనే పేరుగల నాలుగేండ్ల ఇలామా పెరుగుతున్నది.  వైరస్‌పై పోరాటంచేసే కొన్ని ప్రత్యేక యాంటీబాడీలను ఇది ఉత్పత్తి చేసింది.  పరిశోధనలు చేసిన నిపుణులు ఈ యాంటీబాడీలు కరోనా చికిత్సకు సాయపడుతాయని ఓ అంచనాకు వచ్చారు. అయితే ఈ యాంటీబాడీలను జంతువులు, మనుషులపై కూడా ప్రయోగించాల్సి ఉన్నదన్నారు.


logo