e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, September 20, 2021
Home అంతర్జాతీయం లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ ఆస్ట్రేలియాలో నిరసనలు

లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ ఆస్ట్రేలియాలో నిరసనలు

సిడ్నీ: లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తూ ఆస్ట్రేలియాలోని పలు నగరాల్లో వేలాది మంది నిరసన తెలిపారు. ‘మాకు వ్యాక్సిన్‌ అవసరం లేదు స్వేచ్ఛ కావాలి’ అన్న ఫ్ల కార్డులను ప్రదర్శించారు. ఫ్రీడమ్‌.. ఫ్రీడమ్‌, వేకప్‌ ఆస్ట్రేలియా అంటూ నినాదాలు చేశారు. తమ నిరసనను స్వేచ్ఛా ర్యాలీగా పేర్కొన్నారు. ప్రజలు ఇంట్లోనే ఉండాలన్న నిబంధనలను ఉల్లంఘించడంతోపాటు అడ్డుకోబోయిన పోలీసులతో నిరసనకారులు ఘర్షణకు దిగారు. సిడ్నీలో కొందరు నిరసనకారులు పెకలించిన మొక్కలు, బాటిల్స్‌ను పోలీసులపైకి విసిరారు. నిరసనలో పాల్గొన్న చాలా మంది మాస్కులు ధరించలేదు.

కాగా, ఇలాంటి వారే లాక్‌డౌన్‌ను మరింతగా పొడిగిస్తున్నారని న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన పోలీస్‌, అత్యవసర సేవల మంత్రి డేవిడ్ ఇలియట్ విమర్శించారు. సుమారు 3,500 మంది స్వార్థపూరిత మతిలేని వ్యక్తులు సామూహిక నిరసనల్లో పాల్గొన్నారని, సుమారు 50 మందిని అరెస్ట్‌ చేసినట్లు ఆయన చెప్పారు. మరోవైపు ఆస్ట్రేలియాలో ఒకవైపు డెల్టా వేరియంట్‌ వ్యాపిస్తుండగా మరోవైపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మందగించింది. వ్యాక్సిన్ల కొరత, కొత్త మార్గదర్శకాల నేపథ్యంలో ఆ దేశ జనాభాలో 21 శాతం మంది ప్రజలు మాత్రమే ఇప్పటి వరకు కరోనా టీకాలు పొందారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana