ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Aug 30, 2020 , 17:20:33

నార్వేకు పాకిన స్వీడన్ అల్లర్లు

నార్వేకు పాకిన స్వీడన్ అల్లర్లు

ఓస్లో : స్వీడన్‌లో హింసాత్మక ఇస్లాం వ్యతిరేక నిరసనలు పొరుగు దేశమైన నార్వేకు వ్యాపించాయి. నార్వేజియన్ రాజధాని ఓస్లోలో ఇస్లాం వ్యతిరేక, ఇస్లాం మద్దతుదారుల మధ్య శనివారం హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి. ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్ కాపీలను నిరసనకారులు చింపివేశారని చెప్తున్నారు. ఈ ప్రదర్శనలను నార్వేజియన్ మితవాద సంస్థ స్టాప్ ఇస్లామైజేషన్ ఆఫ్ నార్వే (సియాన్) నిర్వహించింది.

నిరసనకారులు నార్వేజియన్ రాజధాని ఓస్లోలోని పార్లమెంట్ భవనం వెలుపల సమావేశమై ఇస్లామిక్ భావజాలంపై తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఈ ప్రదర్శన సుమారు రెండు గంటల పాటు కొనసాగింది. స్టాప్ ఇస్లామైజేషన్ ఆఫ్ నార్వే నాయకుడు లార్స్ థోర్సన్.. అనేక ఇస్లాం వ్యతిరేక ప్రకటనలు చేశారు. ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాటలు పాడారు. మరోవైపు, నార్వే ఇస్లామీకరణను ఆపుతున్న నిరసనల దృష్ట్యా.. దాని ప్రత్యర్థులు కూడా అక్కడ గుమిగూడారు. కానీ పోలీసులు వెంటనే చర్యలు తీసుకోలేదు. ఈ దశలో స్టాప్ ఇస్లామైజేషన్ సభ్యుడు ఖురాన్ ను చించివేసాడు. దాంతో ఇస్లాం మద్దతుదారుల నిరసనలు దూకుడుగా మారాయి. ఇస్లాం మద్దతుదారులు పోలీస్ బారికేడ్లను విచ్ఛిన్నం చేసి ఘర్షణకు దిగేందుకు ప్రయత్నించగా.. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి గాయపడినట్లు చెప్తున్నారు. పోలీసులు పెద్ద సంఖ్యలో ఆందోళనాకారులను అరెస్టు చేశారు.

అంతకుముందు శుక్రవారం రాత్రి స్వీడన్‌లో వందలాది మంది మితవాద కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి అల్లర్లకు కారణమయ్యారు. ఖురాన్ ను తగులబెట్టారు. పరిస్థితిని నియంత్రించడానికి ప్రయత్నించినప్పుడు సుమారు 300 మంది పోలీసులపై రాళ్ళు రువ్వినట్లుగా భావిస్తున్నారు. నిషేధానికి గురైన డెన్మార్క్ హార్డ్ లైన్ నాయకుడు రాస్ముస్ పలుడాన్ ను మాలంలో కలవడానికి అనుమతించకుండా, స్వీడన్ సరిహద్దులో నిలిపివేశారు. ఆయన రాకతో స్వీడన్‌లో చట్టాన్ని ఉల్లంఘించి సామాజిక శాంతికి హాని కలుగుతుందని అధికారులు భావించి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.


logo