సోమవారం 25 జనవరి 2021
International - Dec 17, 2020 , 15:13:01

3 నెల‌ల్లో 30,000 భూ ప్ర‌కంప‌న‌లు..

3 నెల‌ల్లో 30,000 భూ ప్ర‌కంప‌న‌లు..

హైద‌రాబాద్: అంటార్కిటికాలో గ‌త మూడు నెల‌ల్లో సుమారు 30 వేల సార్లు భూ ప్ర‌కంప‌న‌లు న‌మోదు అయిన‌ట్లు చిలీ దేశ భూగ‌ర్భ శాస్త్ర‌వేత్త‌లు తెలిపారు.  అంటార్కిటికాలో ఇటీవ‌ల భూ ఫ‌ల‌కాల్లో క‌దిలిక‌లు ఎక్కువ స్థాయిలో న‌మోదు అవుతున్న‌ట్లు గుర్తించారు. సాంటియాగోలోని సెసిమాల‌జీ సెంట‌ర్ వ‌ర్సిటీ అంటార్కిటికా భూ ప్ర‌కంప‌న‌ల‌పై అధ్య‌యనం చేస్తున్న‌ది.  అత్యంత శ‌క్తివంతంగా 6 తీవ్ర‌త‌తో బ్రాన్స్‌ఫీల్డ్ సంధిలో భూకంపం వ‌చ్చిన‌ట్లు  గుర్తించారు.  ఆ సంధి వ‌ద్దే టెక్టానిక్ ఫ‌ల‌కాలు, మైక్రో ఫ‌ల‌కాలు క‌లుస్తాయి. దాని వ‌ల్ల ఆ ఫ‌లకాలు ఢీకొంటున్నాయి.  అంటార్కిటికాలో దాదాపు 20 రెట్లు ప్ర‌కంప‌న‌లు పెరిగిన‌ట్లు సెసిమాల‌జీ డైర‌క్ట‌ర్ సెర్గియో తెలిపారు.  భూగోళంపై అతివేగంగా వేడెక్కుతున్న ప్రాంతంగా అంటార్కిటికా నిలిచింది.  దీంతో అక్క‌డ మంచు కొండ‌లు, గ్లేసియ‌ర్లు క‌రిగిపోతున్నాయి. ప‌ర్యావ‌ర‌ణ శాస్త్ర‌వేత్త‌లు ఈ మార్పుల‌ను గ‌మ‌నిస్తున్నారు.  అయితే తాజాగా న‌మోదు అవుతున్న ప్ర‌కంప‌న‌లు ఏ విధంగా అంటిర్కిటికాపై ప్ర‌భావం చూపుతుందో తెలియడం లేద‌ని వ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త రౌల్ కార్డిరో తెలిపారు. logo