శనివారం 30 మే 2020
International - May 11, 2020 , 16:43:11

అక్కడ కరోనా జాడే లేదంటె నమ్మండి

అక్కడ కరోనా జాడే లేదంటె నమ్మండి

కరోనా వైరస్‌.. ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి. వేల సంఖ్యలో మనుషుల్ని పొట్టన పెట్టుకొని లక్షల మందిని  దవాఖాన పాలు చేసిన ఈ మహమ్మారి పేరు వింటేనే శరీరం భయంతో వణికిపోతుంది. ఈ వైరస్‌ కారణంగా  గత 50 రోజులు ప్రపంచ ప్రజానీకం ఇండ్లకే పరిమితమైపోయారు. బయటకు వస్తే ఎక్కడ అంటుకొంటుందో అన్ని భయంతో బతుకుటున్నారు. అలాంటిది ఈ భూమ్మీద ఒకే ఒక ప్రాంతంలో కరోనా వైరస్‌ జాడే లేదంటే నమ్మబుద్దికావడంలేదు. అయినా నిజం. నమ్మాల్సిందే.

భూమిపై అతి శీతల ప్రదేశంగా పేర్కొనే అంటార్కిటికా ఇప్పుడు ప్రపంచంలో అత్యంత సురక్షిత ప్రదేశంగా పరిగణించబడుతున్నది. ఇక్కడ ఇప్పటివరకు ఎలాంటి వైరస్‌ సోకిన కేసులు ధ్రువీకరణ కాలేదు. అంటార్కిటికా ఖండంలో ఇప్పటివరకు కరోనా వైరస్‌ జాడే లేదని ఘంటాపథంగా  చెప్తున్నారు అక్కడి అడ్మినిస్ట్రేటివ్‌ కో-ఆర్డినేటర్‌ కేరి నీల్సన్‌. మంచుతో కప్పివున్న ఈ ఖండంలో ఉన్న 80 బేస్‌ క్యాంపుల్లో దాదాపు ఐదు వేల మంది ఉంటున్నారు. వీరిలో అధికులు శాస్త్రవేత్తలు, పరిశోధకులే. ఇక్కడ పెంగ్విన్‌లు, తిమింగలాలు, సీల్స్‌, ఆల్బాట్రోసెస్‌ కూడా ఉన్నాయి.


logo