సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 29, 2020 , 02:06:08

మన కోహి‘నూర్‌'కు బ్రిటన్‌లో బ్లూ ప్లేక్‌!

మన కోహి‘నూర్‌'కు బ్రిటన్‌లో బ్లూ ప్లేక్‌!

లండన్‌: రెండో ప్రపంచయుద్ధంలో బ్రిటన్‌ తరఫున గూఢచారిగా పనిచేసిన భారత సంతతి మహిళ నూర్‌ ఇనాయత్‌ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కింది. సెంట్రల్‌ లండన్‌లోని ఆమె నివాసం వద్ద నీలి స్మారక ఫలకాన్ని(బ్లూ ప్లేక్‌) ఏర్పాటు చేశారు. ఈ గౌరవం పొందిన మొట్టమొదటి భారత సంతతి మహిళ నూర్‌ కావడం విశేషం. బ్రిటన్‌లోని ఇంగ్లిష్‌ హెరిటేజ్‌చారిటీ సంస్థ ప్రముఖ వ్యక్తులను గుర్తించి వారితో అనుబంధం ఉన్న భవనాల్లో వారి పేరిట నీలి స్మారకఫలకను ఏర్పాటు చేస్తున్నది. మహాత్మాగాంధీ, అంబేద్కర్‌ లండన్‌ వచ్చినప్పుడు బస చేసిన ప్రాంతాల్లో ఇలాంటి స్మారకాలను ఏర్పాటు చేశారు. నూర్‌ టిప్పుసుల్తాన్‌ వంశం మూలాలున్న వ్యక్తి. 1943లో ఫ్రాన్స్‌కు గూఢచారిగా వెళ్లకముందు సెంట్రల్‌ లండన్‌లో నివసించేవారు. ఆమె ఫ్రాన్స్‌లో బ్రిటన్‌ తరఫున అండర్‌కవర్‌ రేడియో ఆపరేటర్‌గా పనిచేశారు. ఆమెను 1944లో చంపేశారు. అమె ధైర్యసాహసాలకుగాను 1949లో బ్రిటన్‌ ప్రభుత్వం ఆమెకు అత్యున్నత జార్జ్‌క్రాస్‌ అవార్డు ప్రకటించింది.


logo