ఆదివారం 07 జూన్ 2020
International - Apr 05, 2020 , 12:17:09

కెన్నెడీ కుటుంబంలో మరో విషాదం

కెన్నెడీ కుటుంబంలో మరో విషాదం

హైదరాబాద్: అమెరికాలో అత్యున్నత పదవులకు ఎదిగిన కెన్నెడీ కుటుంబం మరోసారి విషాదంలో మునిగింది. ఒకటి వెనుక ఒకటిగా సంభవించే మరణాల కారణంగా ఎప్పుడూ తల్లడిల్లే ఆ కుటుంబాన్ని తాజాగా మృత్యువు పరిహసించింది. హత్యకు గురైన మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ తమ్ముడు రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ మనుమరాలు మేవీ కెన్నెడీ మెక్కీన్, ఆమె కుమారుడు గిడియన్ గత గురువారం పడవలో విహారానికి వెళ్లి గల్లంతయ్యారు. తీరప్రాంత గస్తీదళం, పోలీసులు, అగ్నిమాపకదళం గాలింపు జరిపారు. పడవ దొరికింది కానీ మృతదేహాల జాడ ఇంకా కానరాలేదు. తల్లీకొడుకులు మరణించినట్టు అధికారులు నిర్ధారణకు వచ్చారు. 1963లో అన్న జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య తర్వాత ఐదేళ్లకు 1968లో రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తరుణంలో హత్యకు గురై మరణించారు. 1999లో జాన్ ఎప్ కెన్నెడీ జూనియర్, తన సోదరి, వదినతో చిన్న విమానంలో వెళుతుండగా మసాషిసెట్స్ తీరంలో ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోయారు. రాబర్ట్ కుమారుడు 1984లో కొకైన్ ఓవర్ డోస్ వల్ల ఫ్లారిడాలోని ఓ హోటల్ లో కన్నుమూశారు. ఆయన మరో కుమారుడు మైకేల్ 1997లో కొలరాడోలో స్కీయింగ్ యాక్సిడెంట్ లో మరణించాడు. రాబర్ట్ మనుమరాలు సౌరిస్ కెన్నెడీ హిల్ గత ఏడాది మాదకద్రవ్యాలు అధికంగా తీసుకోవడం వల్ల మరణించింది.


logo