మంగళవారం 07 ఏప్రిల్ 2020
International - Mar 25, 2020 , 01:05:55

చైనాలో మరో కొత్త వైరస్‌

చైనాలో మరో కొత్త వైరస్‌

బీజింగ్‌:  ఒకవైపు కొవి డ్‌-19 నుంచి చావుదప్పి కన్ను లొట్టబోయిన చందంగా బయటపడుతున్న చైనాను.. మరో కొత్త వైరస్‌ పట్టుకొన్నది. హంటా వైరస్‌ మరోసారి ప్రబలుతుండటంతో ఆ దేశం కలవరపడుతున్నది. ఈ వైరస్‌ బారినపడి ఒకరు చనిపోయినట్టు చైనాకు చెందిన ప్రభుత్వ మీడియా సంస్థ గ్లోబల్‌ టైమ్స్‌ వెల్లడించింది. సోమవారం యున్నాన్‌ ప్రావిన్స్‌ నుంచి చార్టర్డ్‌ బస్సులో షాన్డోగ్‌ ప్రావిన్స్‌ వెళ్తుండగా ఆ వ్యక్తి చనిపోయినట్టు తెలిపింది. మృతుడికి వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుపగా హంటా వైరస్‌ సోకినట్టు తేలిందని, బస్సులోని 32 మందికి కూడా హంటా వైరస నిర్ధారణ పరీక్షలు జరిపినట్టు ట్విట్టర్‌లో గ్లోబల్‌ టైమ్స్‌ పేర్కొన్నది.


logo