శనివారం 05 డిసెంబర్ 2020
International - Jun 14, 2020 , 01:17:43

అమెరికా మిలిటరీ అకాడమీలో సిక్కు యువతి రికార్డు

అమెరికా మిలిటరీ అకాడమీలో సిక్కు  యువతి రికార్డు

వాషింగ్టన్‌: అమెరికాలో భారత సంతతి సిక్కు యువతి అన్మోల్‌ నారంగ్‌(23) చరిత్ర సృష్టించారు. అత్యంత ప్రతిష్ఠాత్మక యూఎస్‌ మిలిటరీ అకాడమీ నుంచి శనివారం గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. ‘వెస్ట్‌ పాయింట్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేయాలన్న నా కల నిజం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది’ అని ఆమె ఈ సందర్భంగా అన్నారు. తన వాళ్ల మద్దతు, ఆత్మవిశ్వాసంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. అన్మోల్‌ నారంగ్‌ తన బీఎల్‌ఓసీ కోర్సును పూర్తి చేశాక ఆమె జపాన్‌లో విధులు నిర్వహిస్తారు.