శుక్రవారం 05 జూన్ 2020
International - May 20, 2020 , 16:27:19

గుండెలకు హత్తుకునే ఆవిష్కరణ ఇది..

గుండెలకు హత్తుకునే ఆవిష్కరణ ఇది..

న్యూఢిల్లీ: నర్సుగా పనిచేస్తున్న తల్లి కోసం దవాఖాన ఎదుట పాప ఏడ్వటం.. డాక్టర్‌గా సేవలందిస్తున్న తండ్రి ఇంటికి రాగానే తలుపులు వేసి దూరం వెళ్లాలంటూ చిన్నారిని బుజ్జగించడం.. వంటి సంఘటనలు మన కండ్ల ముందు ఇంకా మెదలాడుతూను ఉన్నాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అంత్యక్రియలు కూడా సరిగా నిర్వహించుకోలేని పరిస్థితులు ఇప్పడు దాపురించాయి. కొవిడ్‌ కారణంగా మారాం చేస్తున్న చిన్నారిని గుండెలకు హత్తుకోలేకపోతున్నాం. భార్యాభర్తలు కూడా దూరంగా ఉండాల్సి వస్తున్నది. అందమైన అనుభూతుల సమాహారాన్ని పొందే ఆత్మీయ ఆలింగనానికి నోచుకోకుండా ఎన్నో జంటలు ఉసూరుమంటున్నాయి. వీరందరి సమస్యలను గమనించాడో.. లేక తనకే అవసరం అవుతుందని భావించాడో.. తెలియదు కానీ, ఓ వ్యక్తి ఆత్మీయ ఆలింగనం కోసం కొత్త డివైస్‌కు ప్రాణం పోశాడు.

ఈ ఆవిష్కరణ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర.. జీవితాన్ని మార్చే ఆవిష్కరణ అంటూ ట్యాగ్‌ ఇచ్చారు. హగ్గింగ్‌ డివైజ్‌ను అభినందిస్తూ.. దీనిని సృష్టించేందుకు నోబెల్‌బహుమతి గ్రహీతను తీసుకోలేదని, ఈ ఆవిష్కరణ కరోనా వైరస్‌ వ్యాప్తి సమయంలో ఆలింగనం చేసుకోవడం తప్పిపోయిన వృద్ధులందరికీ జీవితాన్ని మార్చేదిగా ఉపయోగపడుతుంది.. అని అభిప్రాయపడ్డారు. ఆనంద్‌ మహీంద్రకు ఎంతో ఇష్టమైన ఈ హగ్గింగ్‌ డివైజ్‌ను మీరూ చూసేయండి.


logo