గురువారం 01 అక్టోబర్ 2020
International - Aug 22, 2020 , 15:17:39

మొసలి వర్సెస్‌ అనకొండ..! వీడియో వైరల్‌!

మొసలి వర్సెస్‌ అనకొండ..! వీడియో వైరల్‌!

రియోడిజనీరో: అతిపెద్ద, ప్రమాదకరమైన రెండు సరీసృపాలు భూమిపై తలపడ్డాయి. అనకొండ, మొసలి ఫైటింగ్‌ను చూసి జనాలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టగా, వైరల్‌ అయ్యింది. ఈ వీడియోను చూసి నెటిజన్లు భయబ్రాంతులకు గురయ్యారు.

ఈ సరీసృపాల కొట్లాట బ్రెజిల్‌లోని  మనౌస్ పొంటా నెగ్రా పరిసర ప్రాంతాల్లో జరిగింది. మొసలిని అనకొండ మింగేయడానికి ప్రయత్నించింది. దాన్ని పూర్తిగా చుట్టేసి ఊపిరాడనీయకుండా చేయగా, మొసలి తప్పించుకునేందుకు పెనుగులాడింది. స్థానికులు అనకొండకు తాడుకట్టి లాగగా, ఆ రెండు వేరయ్యాయి. అనకొండ పొడవు ఆరు అడుగుల కంటే ఎక్కువగా ఉందని స్థానికులు తెలిపారు. వాటిని వేరు చేసిన తర్వాత రెండూ అడవిలోకి వెళ్లిపోయాయని చెప్పారు. కాగా, ఈ వీడియోను ట్విట్టర్‌లో పెట్టిన కొద్దిసేపట్లోనే 15 వేల మందికిపైగా చూశారు. పలువురు భయబ్రాంతులకు గురైనట్లు రీట్వీట్‌ చేశారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo