గురువారం 21 జనవరి 2021
International - Jan 08, 2021 , 09:57:20

జూ నుంచి త‌ప్పించుకుని రోడ్ల‌పై ఆస్ట్రిచ్ ప‌రుగులు.. వీడియో

జూ నుంచి త‌ప్పించుకుని రోడ్ల‌పై ఆస్ట్రిచ్ ప‌రుగులు.. వీడియో

క‌రాచీ: పాకిస్థాన్‌లోని క‌రాచీ న‌గ‌రంలో విచిత్ర ఘ‌ట‌న చోటుచేసుకుంది. సిబ్బంది క‌ళ్లుగ‌ప్పి స్థానిక జూపార్కు నుంచి త‌ప్పించుకున్న ఓ ఆస్ట్రిచ్ రోడ్ల‌పై ప‌రుగులు తీసింది. రోడ్డుపై త‌మ‌తో క‌లిసి వ‌య్యారంగా ప‌రుగుపెట్టిన‌ ఆస్ట్రిచ్‌ను చూసి వాహ‌న‌దారులు ఎంజాయ్ చేశారు. ఆ దృశ్యాల‌ను మొబైల్‌ల‌లో బంధించారు. అటూఇటూ తిరిగి ఓ వీడియో IFS అధికారి ప్ర‌వీణ్ కుమార్ దృష్టికి రావ‌డంతో ఆయ‌న ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. 

అమాయక ప‌క్షి.. తాను ఏం చేస్తుందో త‌న‌కే ఒక ఆలోచ‌న లేకుండా రోడ్డుపై ప‌రుగులు తీస్తున్న‌ది అంటూ దానికి క్యాప్ష‌న్ ఇచ్చారు.  కాగా, ఎట్ట‌కేల‌కు జూ సిబ్బంది ఆ ఆస్ట్రిచ్‌ను తిరిగి జూకి త‌ర‌లించారు. ఆస్ట్రిచ్ ప‌రుగుల‌కు సంబంధించిన దృశ్యాల‌ను ఈ కింది వీడియోలో మీరు కూడా వీక్షించండి.      

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo