శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Jul 31, 2020 , 11:35:09

బీరు తాగిన బాలింత‌.. ప‌సికందు మృతి!

బీరు తాగిన బాలింత‌.. ప‌సికందు మృతి!

హైద‌రాబాద్‌: ఒక మహిళ మ‌ద్యం అల‌వాటు ప‌సికందు ప్రాణాలు తీసింది. అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రానికి చెందిన మురియెల్ మోరిస‌న్ అనే మ‌హిళ నాలుగేండ్లు, నెల‌ల‌ వ‌య‌సున్న త‌న ఇద్ద‌రు బిడ్డ‌లు నిద్రిస్తుండ‌గా‌ ఫుల్లుగా బీరు తాగింది. అనంత‌రం బిడ్డ‌ల‌కు డైప‌ర్లు మార్చి, చిన్న‌బిడ్డ‌కు పాలిచ్చి ప‌డుకుంది. అయితే తెల్లారి లేచి చూసేస‌రికి నెల‌ల వ‌య‌సున్న చిన్న కూతురు ప్రాణాలు కోల్పోయింది. 

2013లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న కోర్టు దాకా వెళ్ల‌డంతో ప్ర‌త్యేక న్యాయ‌స్థానం స‌ద‌రు మ‌హిళ‌ను దోషిగా తేల్చి 20 ఏండ్ల జైలుశిక్ష విధించింది. అయితే తీర్పును స‌వాల్ చేస్తూ స‌ద‌రు మ‌హిళ పైకోర్టుకు అప్పీల్ చేసింది. తాజాగా ఆ అప్పీల్‌పై విచార‌ణ జ‌రిపిన మేరీల్యాండ్ ఉన్న‌త న్యాయ‌స్థానం.. స‌ద‌రు మ‌హిళ‌ను నిర్దోషిగా తేల్చింది. మ‌ద్యం సేవించి బిడ్డ‌తో క‌లిసి నిద్రించ‌డం అనేది నేరం కాద‌ని పేర్కొంది. ఈ మేర‌కు కింది కోర్టు విధించిన జైలుశిక్ష‌ను ర‌ద్దుచేసింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo