శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 14, 2020 , 17:42:37

మ‌త వివ‌క్ష ప‌ట్ల పాకిస్తాన్‌పై అమెరికా చివాట్లు

 మ‌త వివ‌క్ష ప‌ట్ల పాకిస్తాన్‌పై అమెరికా చివాట్లు

క‌రోనా సంక్షోభం త‌లెత్తిన  ప‌రిస్థితుల్లో ఇత‌ర మ‌తాల‌పై వివ‌క్ష ప్ర‌ద‌ర్శిస్తున్న పాక్‌ను చివాట్లు పెట్టింది అమెరికా. ఇలాంటి స‌మ‌యంలో మ‌త‌వివ‌క్ష చూపించ‌డం స‌రికాద‌ని  హిత‌వు ప‌లికింది . ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా నియంత్ర‌ణ‌కు అన్ని దేశాలు కూడా లాక్‌డౌన్ పాటిస్తున్న నేప‌థ్యంలో చేయ‌డానికి ప‌ని లేక‌, తిన‌డానికి తిండిలేక అనేక మంది ఇబ్బంది ప‌డుతున్నారు. అయితే పాకిస్తాన్‌లో ఉంటున్న‌ మైనార్టీల‌పై పాకిస్తాన్ చూపుతున్న వివ‌క్ష స‌రికాద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. 

వ‌ల‌స కూలీలు, ఇళ్లు లేని నిరుపేద‌ల‌కు ఆహ‌రాన్ని క‌రాచీలోని సేల‌నీ వెల్ఫేర్ ఇంటర్నేష‌న‌ల్ ట్ర‌స్టు అనే స్వ‌చ్ఛంద సంస్థ అందిస్తుంది. అయితే ఆహారం అందించే స‌మ‌యంలో హిందువులు, క్రిస్టియ‌న్లు స‌హా ఇత‌ర మ‌త‌స్థుల‌పై వివ‌క్ష ప్ర‌ద‌ర్శించింది. ఇతర మతస్థులకు ఆహారాన్నిఇవ్వ‌డానికి నిరాక‌రించింది. ఈ నేప‌థ్యంలోనే అమెరికా పాకిస్తాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇలాంటి ప‌ద్ద‌తి గ‌ర్హ‌నీయ‌మ‌ని త‌లంటింది. ఇప్ప‌టికైనా మ‌నుషులంద‌రినీ స‌మ‌భావంతో చూడాల‌ని సూచించింది. అక్క‌డ‌ చాలా పేద కుటుంబాలు ఆక‌లితో అల్లాడుతున్నాయ‌ని  ఇలాంటి పరిస్థితుల్లో మ‌తం కార‌ణంగా ఆహారాన్ని అందించే విష‌యంలో వివ‌క్ష ప్ర‌ద‌ర్శించ‌డం సరికాద‌ని తెలిపింది.


logo