ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Aug 05, 2020 , 16:57:53

చైనా వంచ‌న‌వ‌ల్లే ల‌క్ష‌ల్లో మ‌ర‌ణాలు: ట‌్రంప్‌

చైనా వంచ‌న‌వ‌ల్లే ల‌క్ష‌ల్లో మ‌ర‌ణాలు: ట‌్రంప్‌

న్యూఢిల్లీ: ప‌్రాణాంత‌క కరోనా మ‌హ‌మ్మారి త‌మ దేశాన్ని క‌కావిక‌లం చేసిన తర్వాత చైనాపై తమ వైఖరి పూర్తిగా మారిపోయింద‌ని అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్‌ ట్రంప్ వెల్ల‌డించారు. చైనా ఈ మహమ్మారిని వుహాన్‌లోనే అంతం చేయాల్సిందని, అలా చేసి ఉంటే ప్రపంచానికి ఈ స్థాయిలో బాధ ఉండేది కాదని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. బుధ‌వారం వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

'చైనా వైరస్‌ మమ్మల్ని తాకిన తర్వాత ఆ దేశంపై మా వైఖరి పూర్తిగా మారిపోయింది. వారు దీన్ని ఆపాల్సింది' అని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుతం 70 శాతం ప్రాంతాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు.  అందువ‌ల్ల కేసుల ప్రభావం ఎక్కువ‌గా ఉన్న ఇతర రాష్ట్రాల్లో మరింత కఠినంగా చర్యలు తీసుకోవాల్సి ఉంద‌ని చెప్పారు. 'ప్రస్తుతం మరణాల రేటు సగానికి తగ్గింది. అయితే అసలు మరణాలే సంభవించకుండా ఉండాల్సింది. నిజానికి వీటిని వుహాన్‌లోనే చైనా ఆపాల్సింది' అని ట్రంప్ పేర్కొన్నారు. 

ఏప్రిల్‌తో పోలిస్తే 18-69 ఏండ్ల‌ మధ్యవారిలో 85%, 70 ఏండ్లు దాటిన వారిలో 70% మరణాలు తగ్గుముఖం పట్టాయని ట్రంప్ తెలిపారు. కరోనా మహమ్మారి నుంచి అమెరికన్లను రక్షించుకొనేందుకు దూకుడుగా విధానాలను రూపొందిస్తున్నామని వెల్లడించారు. కాగా, మోసం, వంచన, కప్పిపుచ్చుకోవడం కార‌ణంగానే వైరస్‌ ప్రపంచమంతా పాకిందని ‌ట్రంప్ గతంలోనే చైనాను విమర్శించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo