బుధవారం 03 జూన్ 2020
International - Apr 05, 2020 , 02:04:50

నేను మాస్కు పెట్టుకోను

నేను మాస్కు పెట్టుకోను

  • అమెరికన్లు మాత్రం ధరించాలి: ట్రంప్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రూటే సపరేటు.. వ్యవహారశైలి, మాటలతో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకొనేందుకు అమెరికన్లు ముఖాలకు మాస్కులు ధరించాలని ట్రంప్‌ శుక్రవారం పిలుపునిచ్చారు. తాను మాత్రం మాస్కులు పెట్టుకోనని స్పష్టంచేశారు. ప్రజలు ముఖాలకు చేతి రుమాలు లేదా ఇంట్లో వస్త్రంతో తయారుచేసిన మాస్కులు పెట్టుకోవాలని యూఎస్‌ సెంటర్‌ ఫర్‌ డిసీస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ సిఫారసు చేసిందని చెప్పారు. వైరస్‌ నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తలు మాత్రమే మెడికల్‌ గ్రేడ్‌ లేదా సర్జికల్‌ గ్రేడ్‌ మాస్కులను ధరించాలని సూచించిందని పేర్కొన్నారు. తాను మాత్రం ఈ సూచనలను పాటించబోనని, మాస్కులు ధరించడం తనకు ఇష్టంలేదని చెప్పారు.


logo