మంగళవారం 31 మార్చి 2020
International - Feb 17, 2020 , 16:37:24

జ‌పాన్ నౌక నుంచి అమెరిక‌న్ల విముక్తి..

జ‌పాన్ నౌక నుంచి అమెరిక‌న్ల విముక్తి..

హైద‌రాబాద్‌:  జ‌పాన్‌లోని యోక‌హోమా న‌గ‌ర తీరంలో ఆగిన డైమండ్ ప్రిన్‌సెస్ నౌక నుంచి సుమారు 400 మంది అమెరిక‌న్లు బ‌య‌టికి వ‌చ్చారు.  ఆ నౌక‌లో ఉన్న ప్ర‌యాణికుల‌కు క‌రోనా వైర‌స్ సోకి ఉంటుంద‌న్న అనుమానాంతో కొన్ని రోజుల నుంచి ఆ నౌక‌ను క్వారెంటైన్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే అమెరికాకు చెందిన రెండు విమానాలు ఇవాళ త‌మ దేశ‌స్థులను తీసుకువెళ్లాయి.  కాలిఫోర్నియాలోని ఎయిర్‌బేస్‌లో ఓ ప్లేన్ దిగిన‌ట్లు స‌మాచారం. అక్క‌డ 14 రోజుల పాటు వారిని వేరుగా ఉంచ‌నున్నారు. 3700 మంది ప్ర‌యాణికులు ఉన్న డైమండ్ ప్రిన్‌సెస్ షిప్‌ను ఈనెల 3వ తేదీ నుంచి క్వారెంటైన్ చేశారు.  క‌రోనా వ‌ల్ల ఇప్ప‌టి వ‌ర‌కు 1672 మంది మ‌ర‌ణించారు. 71 వేల వైర‌స్ సోకిన కేసులు న‌మోదు అయ్యాయి.  logo
>>>>>>