ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 31, 2020 , 06:47:21

టిక్‌టాక్‌తో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం!

టిక్‌టాక్‌తో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చైనా జోక్యం!

వాషింగ్టన్‌: దేశ అధ్యక్ష ఎన్నికలను చైనా తన సోషల్‌ మీడియా యాప్‌ ‘టిక్‌టాక్‌' ద్వారా ప్రభావితం చేస్తుందేమోనని, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటుందేమోనని అమెరికాలోని ఏడుగురు టాప్‌ రిపబ్లికన్‌ పార్టీ సెనెటర్లు ఆందోళన వ్యక్తం చేశారు.ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ డైరెక్టర్‌ జాక్‌ రాట్‌క్లిఫె, ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ డైరెక్టర్‌ క్రిష్టోఫర్‌ రే, హోంల్యాండ్‌ సెక్యూరిటీ తాత్కాలిక సెక్రటరీ చాంద్‌ వూల్ఫ్‌లకు లేఖ రాశారు. దేశాధ్యక్ష ఎన్నికల నిర్వహణలో భద్రత, సమగ్రతను కాపాడేందుకు ట్రంప్‌ ప్రభుత్వం సరైన చర్యలే తీసుకున్నదని పేర్కొన్నారు. 


logo