శుక్రవారం 05 జూన్ 2020
International - May 06, 2020 , 14:51:11

అమెరికాలో మరో కలకలం: వింత రోగాలతో చిన్నారులు

అమెరికాలో మరో కలకలం: వింత రోగాలతో చిన్నారులు

కరోనా విషయంలో అమెరికా, చైనాను మించిపోయిందనే చెప్పొచ్చు. 2 నుంచి 15 ఏండ్ల లోపు పిల్లలు వైరస్  బారి నుంచి తప్పించుకున్నామనకునేలోపే అంతుచిక్కని మరో అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ వ్యాధి సోకిన వారంతా కరోనా నుంచి కోలుకున్నవారే కావడం గమనార్హం. అసలు ఈ వ్యాధి ఏంటి? కరోనాకు సంబంధించినదేనా లేదా వేరేదేమైనా అని నిపుణులు ఆలోచనలో పడ్డారు. ఈ వ్యాధిని ‘మిస్టీరియస్‌ సిండ్రోమ్‌’గా పిలుస్తున్నారు. వీరిలో రక్తనాళాల్లో వాపు, పొత్తికడుపులో నొప్పి, వాంతుల వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా ఉన్న వారిలో కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తుండడంతో కరోనాకు సంబంధించిన వ్యాధిగానే భావిస్తున్నారు. ఇది ఒక్క అమెరికాలోనే కాకండా ప్రాన్స్‌, ఇటలీ, స్విట్జర్లాండ్‌, స్పెయిన్‌, బెల్జియం వంటి నగరాల్లోని చిన్నారులకు ఇలాంటి లక్షణాలతోనే వస్తున్నారని వాపోతున్నారు. అసలు ఇదే కరోనాకు సంబంధించిందేనా? మరి ఇంకేదైనా అని పరిశోధనలు జరుపుతున్నారు శాస్త్రవేత్తలు.  దీనిని మెదట్లోనే అరికట్టకుంటే అదుపు చేయడం కష్టమంటున్నారు.logo