సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Mar 12, 2020 , 22:39:20

అమెరికా అబ్బాయి.. ఇందూరు అమ్మాయి ప్రేమ వివాహం

అమెరికా అబ్బాయి.. ఇందూరు అమ్మాయి ప్రేమ వివాహం

ఇందూరు: అమెరికా అబ్బాయి, నిజామాబాద్‌ అమ్మాయి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఆన్‌లైన్‌లో వీరిద్దరికి పరిచయం ఏర్పడి, అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లింది. గురువారం నిజామాబాద్‌ నగరంలోని శ్రావ్యగార్డెన్‌లో వీరిద్దరి వివాహం జరిపించారు. నిజామాబాద్‌ నగరంలోని నాందేవ్‌వాడకు చెందిన సోమేశ్వర్‌- వరలక్ష్మి దంపతుల ప్రథమ పుత్రిక అర్చన 2010లో ఎమ్మెస్‌ చేయడానికి అమెరికా పంపించారు. 2014లో ఆమె ఎమ్మెస్‌ పూర్తి చేసి అక్కడే జాబ్‌ చేసుకుంటూ  గ్రీన్‌కార్డు సంపాదించింది. జనవరి 2019 ఆన్‌లైన్‌లో మ్యాట్రిమోనీ సైట్‌లో అమెరికాలోని డెట్రాయిట్‌ మిచిగన్‌ సిటీకి చెందిన శాన్‌ విన్‌ డ్యాగ్‌ ఆమెకు పరిచయమయ్యాడు. 

ఆ పరిచయం నెల పదిహేను రోజుల్లో ప్రేమగా మారింది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న వారు కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేశారు. 2015, మే 15న అమెరికాలో జెఫ్‌ సిసిలియా దంపతుల ప్రథమ పుత్రుడు శాన్‌ విన్‌ డ్యాగ్‌తో అమెరికాలో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేయించారు. సంప్రదాయబద్ధంగా తెలుగు కట్టుబాట్లతో వీరిద్దిరి పెళ్లిని నిజామాబాద్‌ నగరంలోని శ్రావ్యగార్డెన్‌లో నిర్వహించారు. అమెరికా నుంచి పెళ్లి కొడుకు తల్లిదండ్రులు ఈనెల 6న వచ్చారు. ఈనెల 15న వారు అమెరికా వెళ్లనున్నారు. ప్రస్తుతం అర్చన ఎం ఫార్మసీ డ్రగ్‌ విభాగంలో జాబ్‌ చేస్తున్నది. పెళ్లి కొడుకు శాన్‌ విన్‌ డ్యాగ్‌ యానిమేషన్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు.  logo