బుధవారం 12 ఆగస్టు 2020
International - Jul 16, 2020 , 17:56:08

25 వేల మంది కార్మికులకు అమెరిక‌న్ ఎయిర్‌లైన్స్ హెచ్చ‌రిక‌

25 వేల మంది కార్మికులకు అమెరిక‌న్ ఎయిర్‌లైన్స్ హెచ్చ‌రిక‌

వాషింగ్ట‌న్ : వ‌చ్చే అక్టోబ‌ర్ నెల‌లో 25 వేల మంది కార్మికులు త‌మ ఉద్యోగాలు కోల్పోనున్న‌ట్లు అమెరిక‌న్ ఎయిర్‌లైన్స్ హెచ్చిరించింది. క‌రోనా వైర‌స్ మ‌హమ్మారి వైమానిక‌రంగంపై ప‌డ‌టం, విమాన‌యాన ప్ర‌యాణానికి డిమాండ్ త‌గ్గ‌డం వ‌ల్ల ఉద్యోగాలు తొల‌గించ‌బ‌డ‌తాయ‌ని తెలిపింది. కాగా ఎయిర్‌లైన్స్ ఇద్ద‌రు ఉన్న‌తాధికారులు బుధ‌వారం నాడు స్పందిస్తూ... అధిక సంఖ్య‌లో కార్మికులు విధులు బ‌హిష్క‌రించినా లేదా రెండేళ్ల వ‌ర‌కు పాక్షిక సెల‌వుల‌కు అంగీక‌రించినా ఈ సంఖ్య త‌గ్గొచ్చ‌ని వారు అన్నారు. 

వైరస్ వ్యాప్తి అక్టోబర్ 1 నాటికి బలహీనపడటంతో విమాన ప్రయాణానికి డిమాండ్ క్రమంగా పుంజుకుంటుందని న‌మ్ముతున్న‌ట్లు తెలిపారు. కాగా దురదృష్టవశాత్తు అలా జరగలేదని  సిఇఒ డౌ పార్కర్, ప్రెసిడెంట్ రాబర్ట్ ఐసోమ్ ఉద్యోగులకు ఇచ్చిన మెమోలో చెప్పారు. అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్ పరిమితులను పునఃస‌మీక్షిస్తుండంతో విమాన ప్రయాణానికి డిమాండ్ మళ్లీ మందగిస్తోందన్నారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో మార్చి, ఏప్రిల్ నెల‌లో విమాన ప్ర‌యాణాలు 95 శాతం ప‌డిపోయాయి. 

అక్టోబర్ వరకు ఉద్యోగాలు తగ్గించకపోవటానికి బదులుగా పేరోల్ ఖర్చులను భరించటానికి యు.ఎస్. ఎయిర్లైన్స్ 25 బిలియన్ డాలర్ల సమాఖ్య సహాయాన్ని అంగీకరించింది. అమెరికన్‌కు 5.8 బిలియన్ డాలర్ల నగదు, రుణాలు, డెల్టాకు 5.4 బిలియన్ డాలర్లు, యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌ 5 బిలియన్ డాలర్లు పొందింది. ఈ సహాయం వైమానిక పరిశ్రమ అంతటా భారీగా ఉద్యోగాల తగ్గింపు ప్ర‌క్రియ‌ను ఆలస్యం చేస్తుంది.

గత వారమే 36 వేల మంది ఉద్యోగులు అక్టోబ‌ర్ లో త‌మ ఉద్యోగాలు కోల్పోవ‌చ్చ‌ని యునైటెడ్ పేర్కొంది. 2 వేల మందికి పైగా పైలట్లకు  డెల్టా నోటీసులు జారిచేసింది. ఫ్లైట్ అటెండెంట్ల సంఖ్య‌ను అమెరికన్ భారిగా త‌గ్గించ‌నుంది. దాదాపు 10 వేల మందిపై వేటు వేయ‌నుంది. సుమారు 4,500 మంది గ్రౌండ్ వర్కర్స్, 3,200 మెకానిక్స్, 2,500 పైలట్లకు నోటీసులు అంద‌నున్నాయి. ఇది క్రూరమైన చ‌ర్య అని అమెరికన్ పైలట్ల యూనియన్ ప్రతినిధి డెన్నిస్ టాజర్ అన్నారు. 


logo