సోమవారం 25 మే 2020
International - Apr 08, 2020 , 07:09:13

అమెరికాలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 1,845 మంది మృతి

అమెరికాలో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 1,845 మంది మృతి

హైదరాబాద్‌ : అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా విజృంభిస్తోంది. అమెరికా నలుమూలల కరోనా కోరలు చాచింది. అమెరికాలో కరోనాతో ఇప్పటి వరకు 12,841 మంది ప్రాణాలు కోల్పోగా, గడిచిన 24 గంటల్లో 1,845 మంది మృతి చెందారు. నిన్న ఒక్కరోజే 27 వేలకు పైగా కొత్త కేసులు నమోదు అయ్యాయి. యూఎస్‌ఏలో ఇప్పటి వరకు 4,00,335 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 

న్యూయార్క్‌లో గడిచిన 24 గంటల్లో 731 మంది మృతి చెందినట్లు గవర్నర్‌ ఆండ్య్రూ కుమో వెల్లడించారు. దీంతో న్యూయార్క్‌ సిటీలో మరణాల సంఖ్య 5,489కి చేరింది. కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో న్యూయార్క్‌ ప్రజలందరూ ఇండ్లకే పరిమితం కావాలని గవర్నర్‌ కోరారు. అత్యవసరమైతేనే నివాసాల నుంచి బయటకు రావాలని విజ్ఞప్తి చేశారు. ఈ నిబంధనలు అందరికి ఇబ్బందిగానే ఉండొచ్చు. కానీ ఇలాంటి పరిస్థితుల్లోనే జాగ్రత్తగా ఉండాలన్నారు న్యూయార్క్‌ గవర్నర్‌. 


logo