శనివారం 28 నవంబర్ 2020
International - Oct 25, 2020 , 16:33:22

ఆసియా కందిరీగలతో బెంబేలెత్తుతున్న అమెరికా...

 ఆసియా కందిరీగలతో బెంబేలెత్తుతున్న అమెరికా...

వాషింగ్టన్: ఆసియా కందిరీగలు మషులను చంపేస్తున్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారితో తల్లడిల్లుతున్న నేపథ్యంలో మరో కొత్త సమస్య వచ్చిపడింది. ఆసియా కందిరీగలు మనుషుల ప్రాణాలు తీస్తున్నాయి. వీటికీ తేనెటీగలకూ అస్సలు పడదు. ఇవి తేనెటీగల కంటే మూడు రెట్లు పెద్దగా ఉంటాయి. అందువల్ల ఇవి అమెరికాలోని తేనెటీగలను చంపేస్తున్నాయి. వీటిని హంతక కందిరీగలు (కిల్లర్ హార్నర్స్) అని అంటారు. అక్టోబర్ 23న ఓ చెట్టుకి ఉన్న ఆసియా కందిరీగల తుట్టెను వాషింగ్టన్ వ్యవసాయ శాస్త్రవేత్తలు చూశారు. బాస్కెట్ బాల్ సైజులో ఉన్న ఆ గూడులో... దాదాపు 200 కందిరీగలు ఉండటాన్ని గుర్తించారు. ఒక్కరోజులో దాన్ని నాశనం చేశారు.

కానీ అవి మాత్రం చనిపోలేదు. కందిరీగల దాడి వల్ల ఆ ప్రాంతంలో 62 మంది చనిపోయినట్లు వ్యాధి నివారణ, నిరోధక కేంద్రం (సెంటర్‌ ఫర్‌ డిసీజెస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌-సీడీసీ) తెలిపింది. ఉన్నట్టుండి ఈ కందిరీగల దాడి అమెరికాలో మొదలవ్వడంతో... అక్కడి రాష్ట్రాలకు కొత్త టెన్షన్ పట్టుకుంది. మన దేశంలో మిడతలు ఎలా దాడి చేశాయో... అలా ఈ కందిరీగలు దాడి చేయగలవు. ఇవి ఇప్పటివరకూ ఎప్పుడూ అమెరికాలో కనిపించలేదు. చైనా, జపాన్‌, థాయ్‌లాండ్‌, దక్షిణ కొరియా, వియత్నాం సహా కొన్ని ఆసియా దేశాల్లో ఉండే ఈ విష కందిరీగలు 2019 డిసెంబరులో తొలిసారి అమెరికాలో కనిపించాయట.

అప్పట్లో పెద్దగా వాటిని పట్టించుకోలేదు. తాజాగా మరోసారి వాషింగ్టన్ రాష్ట్రంలో కనిపించడంతో... కలకలం రేగింది. ప్రస్తుతానికి ఇవి వాషింగ్టన్‌ రాష్ట్రం, బ్రిటీష్‌ కొలంబియాలో మాత్రమే కనిపిస్తున్నాయి.ఈ కందిరీగలు ఎంత డేంజరంటే... కొన్ని కందిరీగలు గుంపుగా వచ్చి... ఓ పెద్ద తేనెతుట్టె ను కొన్ని గంటల్లోనే నాశనం చేసి... అందులోని తేనెటీగలను అన్నింటినీ చంపగలవు. ఈ కందిరీగల్ని ట్రాక్ చేసే వ్యవస్థపై అమెరికా శాస్త్ర వేత్తలుదృష్టి సారించారు. రేడియో ట్రాకింగ్ విధానాన్ని అమలుచేస్తున్నారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.