సోమవారం 30 నవంబర్ 2020
International - Nov 08, 2020 , 18:11:04

మేం గెలిచాం.. 14మంది కొడుకుల తర్వాత కూతురు పుట్టింది

మేం గెలిచాం.. 14మంది కొడుకుల తర్వాత కూతురు పుట్టింది

ఒకప్పుడు ఆడపిల్ల పుడుతుందని తెలియగానే కడుపులోనే చంపేసుకున్నవారిని చాలా మందిని చూశాం. కానీ ఇప్పుడు అలా కాదు.. ఆడపిల్ల పుట్టాలని కోరుకునే వారి సంఖ్య పెరుగుతుంది. ఆడపిల్ల కావాలనే కోరికతో కొన్నేళ్ల పాటు సంతానాన్ని కంటూనే వచ్చారు ఈ జంట. 45ఏళ్ల వయసులో 14మంది మగ సంతానం తర్వాత ఎట్టకేలకు ఓ ఆడపిల్ల పుట్టడంతో వారి ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. 

మిచిగాన్‌కు చెందిన జే స్కావాండ్‌,  కతేరీ స్కావాండ్ గేలార్డ్ హై స్కూల్, గేలార్డ్ సెయింట్ మేరీస్ స్కూల్‌‌ల  స్టూడెంట్స్. 1993 లో వీరిద్దరి మధ్య పరిచయం కొన్నాళ్లకి ప్రేమగా మారింది. టీనేజీలో వివాహం చేసుకున్న వారికి.. కాలేజి నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా పొందేటప్పటికే ముగ్గురు కొడుకులకు తల్లిదండ్రులయ్యారు. ఆ తర్వాత ఆడపిల్ల పుట్టాలనే ఆశతో పిల్లల్ని కంటూనే ఉన్నారు. 

ఇలా వారు 14మంది మగ సంతానానికి జన్మనిచ్చారు. ఇన్నాళ్లకు కతేరీ స్కావాండ్ 45ఏళ్ల వయసు వచ్చాక వారికి ఓ ఆడపిల్ల పుట్టింది. ఇంత మంది మగపిల్లల తర్వాత ఈ పాప పుట్టడం చాలా సంతోషంగా ఉంది అంటూ పొంగిపోతున్న ఆ జంట.. పాపకు మ్యాగీ జేనే అనే పేరు పెట్టుకున్నారు. 

'ఇన్ని సంవత్సరాల తర్వాత మా ఇంట్లో ఆడపిల్ల అడుగుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. మ్యాగీ మాకు దేవుడిచ్చిన గ్రేటెస్ట్ గిఫ్ట్' అని ఆ తండ్రి సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఆ పద్నాలుగు మంది అన్నలు ఆ చిట్టి చెల్లెల్ని ఎత్తుకుని సంబరాలు చేసుకున్నారు. 

'మా పేరెంట్స్ కు ఎట్టకేలకు కూతురు పుట్టింది. వాళ్ల కల ఫలించింది అని పెద్దకొడుకు 28 ఏళ్ల టైలర్ స్కావాండ్ అన్నారు. ఈ కపుల్ మిగిలిన వారి పేర్లు ఇలా ఉన్నాయి. జాచ్, డ్రూ, బ్రాండన్, టామీ, విన్నీ, కల్వాన్, గాబె, వెస్లే, చార్లీ, ల్యూక్, టక్కర్, ఫ్రాన్సిస్కో, ఫిన్లే. ఈ దంపతుల చిన్న కొడుకు ఫిన్లే షిబొయ్‌గన్ ఏప్రిల్ 2018లో పుట్టాడు. ఆ బుడ్డోడి పేరులో ఓ జోక్ కలిపి పెట్టారు. మీడియాతో మాట్లాడుతూ.. 14వ సంతానం కూతురు పుడుతుందని ఆశించాం. అలా జరగకపోవడంతో అతనికి షి బాయ్ అగైన్ అనే పదాలు కలిపి ఫిన్లే షిబొయ్‌గన్ అని పెట్టామంటూ నవ్వుతూ చెప్పుకొచ్చాడు.