తన ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వస్తోన్న అసత్యాల్ని నమ్మవద్దని సీనియర్ నటుడు చంద్రమోహన్ తెలిపారు. తాను క్షేమంగా ఉన్నట్లు వెల్లడించారు. చంద్రమోహన్ ఆరోగ్యం క్షీణించినట్లు సోషల్మీడియాలో గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై మంగళవారం చంద్రమోహన్ స్పందించారు. ‘ఇటీవల నా పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ అభిమానానికి సర్వదా కృతజ్ఞుడిని. నా ఆరోగ్యం గురించి అసత్య వార్తలు వినిపిస్తున్నాయి. వాటిని ఎవరూ నమ్మవద్దు. నేను క్షేమంగా ఉన్నా’ అంటూ ఓ ప్రత్యేక వీడియో ద్వారా చంద్రమోహన్ వెల్లడించారు. ఇటీవల ఆయన 81వ పుట్టినరోజు జరుపుకొన్నారు.