సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Jul 16, 2020 , 14:34:10

అమెజాన్ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌..

అమెజాన్ ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌..

హైద‌రాబాద్‌: ఈ-కామ‌ర్స్ దిగ్గ‌జం అమెజాన్ త‌న ఉద్యోగుల‌కు శుభ‌వార్త అంద‌జేసింది. క‌రోనా తీవ్ర‌త త‌గ్గేవ‌ర‌కు త‌మ ఉద్యోగులు ఇంటి నుంచే ప‌నిచేయ‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఏడాది జ‌న‌వరి 8 వ‌ర‌కు వ‌ర్క్ ఫ్రం హోం చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది. ప్ర‌ముఖ టెక్నాల‌జీ సంస్థ‌లైన‌ గూగుల్‌, ఫేస్‌బుక్‌, యాపిల్ త‌‌మ ఉద్యోగులు ఈ ఏడాది చివ‌రి వ‌రకు ఇంటి నుంచి ప‌నిచేయ‌వ‌చ్చ‌ని ఇప్ప‌టికే  ప్ర‌క‌టించాయి. 

క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో ఉద్యోగుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అమెజాన్ వెల్ల‌డించింది. క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుగుతుండ‌టంతో ఉద్యోగుల‌కు ఇంటి నుంచి ప‌నిచేసే అవ‌కాశాన్నిక‌ల్పించింది. అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు ఉద్యోగుల‌కు ఇంటి నుంచి ప‌నిచేయ‌వ‌చ్చ‌ని మే నెల‌లో తెలిపింది. కాగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా క‌రోనా కేసులు పెరుగుతుండ‌టంతో తాజాగా గ‌డువును మ‌రో మూడు నెల‌లు పొడిగించింది. అమెజాన్ సంస్థ‌లో 8.4 ల‌క్ష‌ల‌కు పైగా ఉద్యోగులు ప‌నిచేస్తున్నారు.


logo