శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Sep 05, 2020 , 18:25:33

రూ .14 లక్షల విలువచేసే ఖాళీ బ్యాగు ధ్వంసం .. ఎందుకో తెలుసా..?

రూ .14 లక్షల విలువచేసే ఖాళీ బ్యాగు ధ్వంసం .. ఎందుకో తెలుసా..?

కాన్‌బెర్రా: అది మొసలి చర్మంతో తయారు చేసిన బ్యాగు. దాని విలువ 26,000 డాలర్లు.. అంటే ఇండియన్‌ కరెన్సీలో రూ .14 లక్షలు. కానీ దిగుమతి చేసుకున్నట్లు అనుమతి పత్రం లేకపోవడంతో కస్టమ్స్‌ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం దాన్ని ధ్వంసం చేశారు. 

ఫ్రాన్స్‌లోని సెయింట్ లారెంట్ దుకాణం నుంచి ఆస్ట్రేలియాకు చెందిన మహిళ ఈ బ్యాగును కొనుగోలు చేశారు. ఈ లగ్జరీ బ్యాగ్‌ తీసుకొస్తున్న మహిళను పెర్త్‌లోని ఆస్ట్రేలియన్ బోర్డర్ ఫోర్స్ కస్టమ్స్‌ అధికారులు సోదా చేశారు. సరైన పత్రాలు లేకపోవడంతో బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. మొసలి చర్మంతో తయారైన వస్తువులను ఆస్ట్రేలియాలో అనుమతిస్తారు. కానీ, యజమానులు 70 డాలర్లు చెల్లించి అనుమతి పొందాల్సి ఉంటుంది. కాగా, పర్మిషన్‌ లెటర్‌ లేకపోవడంతో అక్రమ వన్యప్రాణుల వ్యాపారానికి పాల్పడి ఉండవచ్చనే అనుమానంతో అధికారులు ఈ బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఆస్ట్రేలియా పర్యావరణ మంత్రి సుసాన్ లే స్పందించారు. ఎవరైనా ఇతర దేశాలనుంచి జంతు ఉత్పత్తులను తీసుకొస్తే తప్పక దిగుమతి అనుమతి పత్రం జతపర్చాలని కోరారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo