ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Sep 02, 2020 , 14:53:12

చికెన్ పెట్టడం లేదని మొసలి అలిగింది..! వీడియో వైరల్‌..

చికెన్ పెట్టడం లేదని మొసలి అలిగింది..! వీడియో వైరల్‌..

న్యూయార్క్‌: చిన్నపిల్లలకు మనమేదైనా ఇస్తామని ఆశచూపి ఇవ్వకుంటే ఎలా అలుగుతారో మీకు తెలుసు.. అచ్చం అలాగే మొసలి కూడా అలుగుతుందని మీకు తెలుసా? ఒకరు చికెన్‌ ముక్క పెట్టకుండా ఆశచూపడంతో ఓ క్రొకడైల్‌ ముఖం మాడ్చుకుని నీటిలోకి వెళ్లిపోయింది. యూఎస్‌లోని ఫ్లోరిడాలో జరిగిన ఈ అపూర్వ సంఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. మనిషిలాగే సరీసృపాలు కూడా అలుగుతాయా? అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 

ఫ్లోరిడాలోని ఎవర్‌గ్లేడ్స్ హాలిడే పార్క్‌లో ఈ వీడియోను చిత్రీకరించారు. ‘సెవెన్’ అనే మొసలికి క్రిస్‌ అనే వ్యక్తి చికెన్‌ పెడతానని ఆశచూపడంతో నీటి నుంచి బయటకి వచ్చింది. అయితే, అతడు దానిని నోటికి అందించనట్లే ఆశపెట్టి కింద పడేశాడు. దీంతో అలిగిన మొసలి నీటిలోకి వెళ్లిపోయింది. క్రిస్‌ చికెన్‌ ముక్క పట్టుకొని వెళ్లినా వెనక్కు చూడలేదు. ఈ వీడియో సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతోంది.  ‘పాపం సెవెన్‌ ఇబ్బందిపడింది’ అని ఒకరు కమెంట్‌ చేయగా, ‘కిందపడిపోయిన ముక్క నేను ముట్టను.. నాకు ఆకలిగా లేదు.’ అంటూ మొసలి అంటున్నట్లుగా మరొకరు రాశారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo