శనివారం 06 జూన్ 2020
International - May 12, 2020 , 10:16:21

ఇరాన్‌లో అన్ని మ‌సీదులు ఓపెన్‌..

ఇరాన్‌లో అన్ని మ‌సీదులు ఓపెన్‌..


హైద‌రాబాద్‌: ఇరాన్‌లో నేటి నుంచి అన్ని మ‌సీదులు తెరుచుకోనున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు రెండు నెల‌ల నుంచి దేశంలోని అన్ని మ‌సీదుల‌ను మూసివేశారు. అయితే ప్ర‌స్తుతం ఆరోగ్య‌శాఖతో సంప్ర‌దింపులు జ‌రిపిన త‌ర్వాత మ‌సీదులు తెరువాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఇస్లామిక్ డెవ‌ల‌ప్మెంట్ ఆర్గ‌నైజేష‌న్ డైర‌క్ట‌ర్ మొహ‌మ్మ‌ద్ ఖోమి తెలిపారు. గ‌త శుక్ర‌వారం దేశంలోని సుమారు 180 ప‌ట్ట‌ణాల్లో ఉన్న మ‌సీదుల్లో ప్రార్థ‌న‌లు జ‌రిగాయి.  కానీ దేశ రాజ‌ధాని టెహ్రాన్‌లో మాత్రం శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల‌ను నిలిపేశారు. స్కూళ్ల‌ను వ‌చ్చే వారం ఓపెన్ చేయ‌నున్న‌ట్లు అధ్య‌క్షుడు హ‌స‌న్ రోహ‌నీ తెలిపారు. రెండు న‌గ‌రాల మ‌ధ్య ప్ర‌యాణాల‌పై నిషేధం విధించారు. మాల్స్‌ను కూడా మూసివేశారు.  ఇరాన్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 6685 మంది మ‌ర‌ణించారు. సుమారు ల‌క్ష‌కు పైగా పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. logo