శనివారం 26 సెప్టెంబర్ 2020
International - Aug 08, 2020 , 18:52:40

భారీ పేలుడు త‌ర్వాత పావురాన్ని ఆదుకున్న వ్య‌క్తి.. దెబ్బ‌తో పాపుల‌ర్ అయ్యాడు!

భారీ పేలుడు త‌ర్వాత పావురాన్ని ఆదుకున్న వ్య‌క్తి.. దెబ్బ‌తో పాపుల‌ర్ అయ్యాడు!

ఒక్క‌సారిగా బీరుట్ న‌గ‌రాన్ని అత‌లాకుత‌లం చేసిన భారీ పేలుడు విధ్వంసం సృష్టించింది. మ‌ర‌ణాల సంఖ్య 150ను దాట‌డంతో ప్ర‌జ‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ పేలుడుకి మ‌నుషులే కాదు. జంతువులు, పక్ష‌లు కూడా ప్రాణాలు కోల్పోయాయి. మ‌రికొన్ని గాయాలు పాల‌య్యాయి. పేలుడు కార‌ణంగా క‌న్ను కోల్పోయిన పావురం దాహంతో కొట్టిమిట్టాడుతున్న‌ది. దీనికి దాహం తీర్చ‌డానికో వ‌చ్చాడు వ్య‌క్తి. ఇత‌ని పేరు అబ్దేల్ సలాం.

బాటిల్‌తో నీరు తీసుకొచ్చి పావురం దాహం తీర్చాడు. ఈ హృద‌య‌పూర్వ‌క వీడియోను మొద‌ట న్యూయార్క్ టైమ్స్ మిడిల్ ఈస్ట్ క‌ర‌స్పాండెంట్ అయిన వివియ‌న్ యూ అనే యూజ‌ర్ ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. దాహం తీర్చిన వ్య‌క్తి అక్క‌డివాడు కాదు. సిరియా నుంచి వ‌చ్చిన అత‌ను ఇప్ప‌డు నెట్టింట్లో వైర‌ల్‌గా మారాడు. ఈ వీడియో నెటిజ‌న్ల హృద‌యాల‌ను తాకింది. మ‌ళ్లీ మాన‌వ‌త్వంపై న‌మ్మ‌కం క‌లిగించిందంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు. 

   


logo