ఆదివారం 25 అక్టోబర్ 2020
International - Sep 23, 2020 , 14:51:58

హాస్పిట‌ల్ నుంచి న‌వాల్ని డిశ్చార్జ్‌..

హాస్పిట‌ల్ నుంచి న‌వాల్ని డిశ్చార్జ్‌..

హైద‌రాబాద్‌: విష ప్ర‌యోగానికి గురైన ర‌ష్యా ప్ర‌తిప‌క్ష నేత అలెక్సీ న‌వాల్ని ఇవాళ జ‌ర్మ‌నీ హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బెర్లిన్‌లోని ఛారిటీ హాస్పిట‌ల్‌లో న‌వా‌ల్ని 32 రోజుల పాటు చికిత్స పొందారు. ఐసీయూ నుంచి అత‌న్ని డిశ్చార్జ్ చేసిన‌ట్లు డాక్ట‌ర్లు చెప్పారు.   ప్ర‌స్తుతం న‌వాల్ని కోలుకుంటున్న తీరును ప‌రిశీలిస్తే, అత‌ను పూర్తిగా విష‌ప్ర‌యోగం నుంచి కోలుకునే అవ‌కాశం ఉన్న‌ట్లు హాస్పిట‌ల్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. సోవియ్ కాలం నాటి న‌ర్వ్ ఏజెంట్‌తో న‌వాల్నిపై విష‌ప్ర‌యోగానికి పాల్ప‌డిన‌ట్లు జ‌ర్మ‌నీ ర‌సాయ‌నిక ఆయుధాల నిపుణులు వెల్ల‌డించారు.  ఆగ‌స్టు 20వ తేదీన ఓ విమానంలో ప్ర‌యాణిస్తున్న న‌వాల్నిపై విష‌ప్ర‌యోగం జ‌రిగింది.  అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న న‌వాల్ని టార్గెట్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.  రెండు వారాల పాటు న‌వాల్ని కోమాలోనే ఉన్నారు.  విష‌ప్ర‌యోగం విష‌యంలో ర‌ష్యాను నిల‌దీయాల‌ని జ‌ర్మ‌నీ డిమాండ్ చేస్తున్న‌ది. logo