సోమవారం 08 మార్చి 2021
International - Jan 18, 2021 , 12:02:06

అలెక్సీ న‌వాల్నీని అరెస్టు చేసిన ర‌ష్యా

అలెక్సీ న‌వాల్నీని అరెస్టు చేసిన ర‌ష్యా

మాస్కో: విష ప్ర‌యోగానికి గురైన ర‌ష్యా ప్ర‌తిప‌క్ష నేత అలెక్సీ న‌వాల్నీని ఆ దేశం అరెస్టు చేసింది.  ఆయ‌న్ను రిలీజ్ చేయాలంటూ అమెరికాతో పాటు యురోపియ‌న్ యూనియ‌న్ దేశాలు డిమాండ్ చేశాయి.  జ‌ర్మ‌నీ నుంచి మాస్కోకు విమానంలో రాగానే.. న‌వాల్నీని ర‌ష్యా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  న‌ర్వ్ ఏజెంట్‌తో విష ప్ర‌యోగం జ‌రిగిన అయిదు నెల‌ల త‌ర్వాత ఆయ‌న‌ ర‌ష్యాకు తిరిగి వ‌చ్చాడు. న‌వాల్నీపై విష‌ప్ర‌యోగం చేయ‌లేద‌ని పుతిన్ ప్ర‌భుత్వం పేర్కొన్న‌ది. కానీ ప్ర‌తిప‌క్ష నేత‌పై పాయిజ‌నింగ్ జ‌రిగిన‌ట్లు ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్టులు ఆరోపిస్తున్నారు. అధ్య‌క్షుడు పుతిన్‌కు వ్య‌తిరేకంగా న‌వాల్నీ అనేక ఉద్య‌మాలు చేశారు.  ప్ర‌తిప‌క్ష నేత గొంతును నొక్కే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అమెరికా ఆరోపించింది.  ఎటువంటి ష‌ర‌తు లేకుండా ఆయ‌న్ను రిలీజ్ చేయాల‌ని అమెరికా డిమాండ్ చేసింది.  దృఢ‌చిత్తంతో ఉన్న నేత‌లు ఎవ‌ర్నీ అదుపులోకి తీసుకోరు అని అమెరికా మంత్రి పాంపియో తెలిపారు. 

VIDEOS

logo