వాషింగ్టన్: ఆల్కహాల్ వినియోగానానికి, ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి చాలా దగ్గరి సంబంధం ఉన్నదని తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. 2020వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా కొత్తగా నమోదైన క్యాన్సర్ కేసులలో 7.40 లక్షలకుపైగా కేసులకు ఆల్కహాల్ వినియోగంతో లింకు ఉన్నదని అధ్యయనం స్పష్టంచేసింది. ఈ అధ్యయన ఫలితాలు తాజాగా ద లాన్సెట్ ఆంకాలజీ అనే జర్నల్లో ప్రచురితమయ్యాయి.
తాజా అధ్యయనం ప్రకారం.. 2020లో కొత్తగా బయటపడ్డ మొత్తం కేసులలో 4 శాతం కేసులు ఆల్కహాల్ వినియోగంతో సంబంధం కలిగి ఉన్నాయని తేలింది. అందువల్ల క్యాన్సర్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల్లో దాని ప్రభావాన్ని తగ్గించాలంటే క్యాన్సర్కు, అల్కహాల్కు ఉన్న లింకు గురించి ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని పరిశోధకులు తెలిపారు. అందుకు ప్రభుత్వాల జోక్యాలు పెరుగాలని సూచించారు.
ఇక 2020లో నమోదైన 7,41,300 ఆల్కహాల్ అసోషియేటెట్ క్యాన్సర్ కేసులలో మహిళలతో పోల్చుకుంటే పురుషులు చాలా ఎక్కువ శాతం ఉన్నారని, 77 శాతం మంది (5,68,700) పురుషులు ఉంటే కేవలం 23 శాతం మంది (1,72,600) మహిళలు ఉన్నారని అధ్యయనంలో వెల్లడైంది. ఇక క్యాన్సర్ రకాల విషయానికి వస్తే ఆల్కహాల్ అసోషియేటెడ్ క్యాన్సర్ కేసులలో ఓసోఫాగస్, లివర్, బ్రెస్ట్ క్యాన్సర్లు ఎక్కువగా ఉన్నాయని తేలింది.
ఇవి కూడా చదవండి..
షుగర్ పేషెంట్లు కోడిగుడ్లు తినొచ్చా..?
ఆ టాయిలెట్స్ వినియోగిస్తే మనకే డబ్బులిస్తారట..!
లేహ్ ఆందాల వీక్షణకు పోటెత్తిన టూరిస్టులు..!
ఇంట్లో దూరి 21 పిల్లలు చేసిన నాగుపాము..!
ముక్కులో చెక్కపుల్లలు.. వారమైనా గుర్తించలేకపోయిన మహిళ..!