శుక్రవారం 03 ఏప్రిల్ 2020
International - Mar 05, 2020 , 17:12:19

అడవిలో గెంతులేస్తోన్న ఒరాంగుటాన్‌..వీడియో

అడవిలో గెంతులేస్తోన్న ఒరాంగుటాన్‌..వీడియో

ప్రపంచంలోనే అంతరించిపోయే దశలో ఉన్న అత్యంత అరుదైన  అల్బినో ఒరాంగుటాన్‌ చింపాంజీ జనావాసాల నుంచి అటవీ ప్రాంతంలోకి అడుగుపెట్టింది. అల్బినో ఫారెస్ట్‌ తిరుగుతున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి.  సుమారు ఏడాది తర్వాత అల్బినో ఒరాంగుటాన్‌ ను అడవిలోకి వదిలిపెట్టినట్లు ఫారెస్ట్‌ కన్జర్వేటర్లు వెల్లడించారు. ఇండోనేషియాలోని కాలిమంతన్‌ గ్రామస్థులు 2017లో నల్లటి కండ్లు, తెల్లటి వెంట్రుకలతో ఉన్న పిల్ల అల్బినో ఒరాంగుటాన్‌ను కాపాడి ఫారెస్ట్‌ కన్జర్వేటర్లకు అప్పగించారు. ఫారెస్ట్‌ కన్జర్వేటర్లు దానిని జాగ్రత్తగా పెంచి సుమారు ఏడాది తర్వాత 2018లో బోర్నియో ఫారెస్ట్‌లో వదిలారు. 

అల్బినో మనుషుల సాయం అవసరం లేకుండా ఫారెస్ట్‌లో గూడు కట్టుకుని స్వతంత్రంగా జీవిస్తుందని గ్రహించిన తర్వాత దానిని అడవిలోకి వదిలిపెట్టామని పర్యావరణ మంత్రిత్వ శాఖ బయో డైవర్సిటీ కనర్జర్వేషన్‌ డైరెక్టర్‌ ఇంద్ర ఎక్స్‌ప్లొటేషియా తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా కాగితం, ఆయిల్‌, గనుల తవ్వకాల పేరుతో అడవులను నరికవేస్తుండటంతో అల్బినో ఒరాంగుటాన్లు కనుమరుగుపోయి..అంతరించిపోయే దశకు చేరుకున్నాయి.


logo